నాలాల్లో పిల్లలు కొట్టుకుపోతుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారు, ఏపీ రాజకీయాలపై జోక్యం తగదు: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు - minister karumuri nageswara rao comments
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-11-2023/640-480-19935358-thumbnail-16x9-minister-karumuri-counter-to-cm-kcr.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 3, 2023, 8:30 PM IST
AP Minister Karumuri Counter To KCR: తెలంగాణాలో ఎన్నికలొస్తే కేసీఆర్ అక్కడి రాజకీయాలే చూసుకోవాలని.. తెలంగాణ ధనిక రాష్ట్రమేతే ఏపీ ఇంకా గుడిసె తరహానేనని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఏపీలో ఉత్పత్తి అయ్యే సన్నబియ్యాన్ని తెలంగాణాలో తింటున్నారని, ఆ బియ్యాన్నే తెలంగాణలో కొనుగోలు చేస్తున్నారని స్పష్టంచేశారు. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం అవుతోందంటూ కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ చిన్న పాటి వర్షానికే హైదరాబాద్ మునిగి పోతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. కరోనా సమయంలో ప్రజలను గాలికి వదిలి కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకున్నారని మంత్రి ఆరోపించారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ చిన్న పాటి వర్షానికే హైదరాబాద్ మునిగి పోతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. పిల్లలు నాలాల్లో కొట్టుకుపోతుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో పేదరికం 6 శాతానికి తగ్గిందని తెలియజేశారు. విశాఖను రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే అక్కడకు పాలన తరలిపోతుందని తేల్చిచెప్పారు.