High Court Status Co: ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు: హైకోర్టు స్టేటస్‌కో - దళిత మహిళ భూమి
🎬 Watch Now: Feature Video
AP High Court Status Co on SC Woman Land in Chittoor: చిత్తూరు జిల్లాలో దళిత మహిళ భూమిలో నిర్మాణాలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం(హైకోర్టు) స్టే విధించింది. ఇరువరం గ్రామంలో రాజేశ్వరి అనే దళిత మహిళ భూమిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించ తలపెట్టారు. ఈ క్రమంలో తన భూమిలో చేపడుతున్న వైసీపీ పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని నిలిపేయాలని కోరుతూ రాజేశ్వరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై హైకోర్టు నేడు విచారణ జరిపింది. దళిత మహిళ రాజేశ్వరి రెండు ఎకరాల భూమిలో వైసీపీ పార్టీ కార్యాలయ నిర్మాణం చేపడుతున్నారని ఆమె తరఫు న్యాయవాది పాలేటి మహేష్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం దళిత మహిళ భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టొద్దని స్పష్టం చేసింది. నిర్మాణాలపై 8 వారాల పాటు స్టేటస్ కో విధించింది. అనంతరం తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.