ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు పిటిషన్లపై హైకోర్టులో విచారణ - యథాతథ స్థితి పాటించేలా ఆదేశిస్తామని వెల్లడి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 21, 2023, 10:22 AM IST
AP High Court Hearing on Camp Office Shifting to Vizag: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు పేరుతో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించే యత్నాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని భావిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. కార్యాలయాలను తరలించేందుకు ప్రభుత్వ వేగంగా చర్యలు తీసుకుంటోందని పిటిషనర్లు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో తిసభ్య ధర్మాసనం వ్యాజ్యాలపై విచారణ నిర్ణయం వెల్లడించేంత వరకు యథాతథ స్థితి పాటించేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని పేర్కొంది. ప్రభుత్వ తరపు న్యాయవాది సుమన్ స్పందిస్తూ ఈ వ్యవహారంపై ప్రభుత్వం నుంచి వివరాలు తీసుకొని కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి విచారణను గురువారానికి వాయిదా వేశారు. సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు ముసుగులో విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు చేయబోతున్నారంటూ అమరావతి పరిరక్షణ సమితి నేతలు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ కోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారన్నారు. అమరావతిలో సచివాలయానికి మించిన విస్తీర్ణాన్ని విశాఖలో సిద్ధం చేస్తున్నారన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ ఇరువైపు న్యాయవాదుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొని త్రిసభ్య ధర్మాసనం వద్దకు వ్యాజ్యాల్ని పంపి పిటిషన్లపై నిర్ణయం వెల్లడించేంత వరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్కో జారీచేస్తానని ప్రతిపాదించినట్లు తెలిపారు.