High Court Additional Judges Swearing Ceremony: విజయవాడలో ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం..
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 21, 2023, 1:34 PM IST
High Court Additional Judges Swearing Ceremony: ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా.. నూనెపల్లి హరినాథ్, మండవ కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్.. ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. వీరితో ప్రమాణం చేయించారు. ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తుల నియామకంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ చదివి వినిపించారు. అదనపు న్యాయమూర్తులుగా రెండేళ్ల పాటు కొనసాగిన అనంతరం సీనియర్ జడ్జిలుగా నియమితులు అవుతారని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, హైకోర్టు సీజే, న్యాయమూర్తులు, కొత్త న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన వారికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. న్యాయవాదుల కోటా నుంచి ఈ నలుగురిని న్యాయమూర్తులుగా నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. కేంద్ర న్యాయశాఖ వీరి నియామకానికి ఈనెల 18న ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల పోస్టులకుగానూ ప్రస్తుతం 27 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు ఇతర రాష్ట్రాలకు బదిలీ కాగా, కర్ణాటక నుంచి జస్టిస్ నరేందర్ బదిలీపై ఏపీ హైకోర్టుకు వస్తున్నారు. కొత్తగా నియమితులైన నలుగురితో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరనుంది.