Ap Connect Expo Programme In Vizag: ఆధునిక సాంకేతికతపై అవగాహన కోసమే.. విశాఖలో ఏపీ కనెక్ట్ ఎక్స్పో - AP Connect Expo program is over in vizag
🎬 Watch Now: Feature Video
AP Connect Expo program Is Over In Vizag: కేబుల్ టీవీ, ఓటీటీ రంగంలో వచ్చిన సాంకేతిక మార్పులను పరిచయం చేసేందుకు విశాఖపట్టణంలోని గాదిరాజు ప్యాలెస్‌లో ఏపీ కనెక్ట్ పేరిట ఏర్పాటు చేసిన ఎక్స్పో కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, ఇతర ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకునేందుకు రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ ఎక్స్పో కార్యక్రమం ఎంతో ఉపకరించిందని సందర్శకులు తెలిపారు. ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఈటీవీ విన్ స్టాల్‌కు విశేష స్పందన వచ్చింది. ఈ ప్రదర్శనలో భాగంగా విన్‌తో వినోదం పేరిట ఈటీవీ విన్ యాప్ ఆందిస్తున్న ప్రత్యేక రాయితీలను నగరవాసులు పెద్దసంఖ్యలో సద్వినియోగం చేసుకున్నారు. ఈటీవీ విన్ యాప్ గోల్డెన్ స్పాన్సర్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో.. 70కి పైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. అత్యాధునిక 4కే సాంకేతికతను అందుకునేందుకు ప్రదర్శనలో స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులను సామాన్య ప్రజలకు తెలియజేయడంలో ఈ ఎక్స్పో కార్యక్రమాలు ఎంతో దోహద పడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలనుకునే వారి సంకల్పానికి ఈ ఎక్స్పో నిర్వహణ తమకు ఎంతో దోహదపడిందని నిర్వహకులు అన్నారు.