Annapurna Devi Avatar Of Goddess Kanaka Durga: అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన విజయవాడ కనకదుర్గమ్మ - అన్నపూర్ణ దేవి రూపంలో కనకదుర్గ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 17, 2023, 10:02 PM IST
Annapurna Devi Avatar Of Goddess Kanaka Durga: విజయవాడ కనకదుర్గ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా 3 రోజు కనకదుర్గమ్మ అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవిగా అలంకృతమైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఓ చేతిలో అక్షయపాత్ర, మరో చేతిలో గరిట పట్టి మానవాళి ఆకలి దప్పులను తీర్చే తల్లి అన్నపూర్ణ దేవి రూపం భక్తుల్లో పారవశ్యాన్ని నింపుతోంది. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు.
దసరా ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణాదేవిగా మంత్రిని రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు, హైకోర్టు న్యాయమూర్తులు, వివిధ శాఖల అధికారులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక కుంకుమార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 4 గంటల నుంచే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.