Anganwadi workers to stage Chalo Vijayawada : 'చలో విజయవాడ' కార్యక్రమానికి వెళ్తున్న అంగన్వాడీల అడ్డగింత - ap politics news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 25, 2023, 8:56 AM IST

Anganwadi workers to stage Chalo Vijayawada : డిమాండ్ల సాధన కోసం ఆదివారం చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను.. పలు చోట్ల పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వేస్టేషన్‌కి వెళ్తున్న అంగన్వాడీలను బస్టాండ్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అంగన్వాడీలను.. బలవంతంగా స్టేషన్‌కి తరలించారు. చలో విజయవాడ కార్యక్రమానికి బయలుదేరిన కర్నూలు జిల్లా ఆదోనిలోని అంగన్వాడీలను గుంతకల్ రైల్వే స్టేషన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ప్రభుత్వం ఇచ్చే జీతం ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచాలని న్యాయమైన డిమాండ్ల పోరాటం కోసం చలో విజయవాడ వెళ్లడం తప్ప అని ప్రశ్నించారు. డిమాండ్ల పోరాటం కోసం వెళ్తుంటే.. ఎలా ఆపుతారంటూ నిలదీశారు.. తమను పోలీసులు అడ్డుకుంటే పోరాటం ఆపమని అంగన్వాడీ కేంద్రాల నుంచి పోరాటాలు చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువడమే తమ లక్ష్యం అంగన్వాడీలు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.