అంగన్వాడీల దీక్షా శిబిరానికి అనుకోని అతిథి - వినతిపత్రం స్వీకరించడంతో హర్షాతిరేకాలు - ap political update
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 26, 2023, 4:44 PM IST
Anganwadi Workers Strike Strange Incident : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన సమ్మె దీక్ష శిబిరం వద్ద మంగళవారం ఒక విచిత్రమైన సంఘటన చోటుచోసుకుంది. అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో ఒక వానరం దీక్షా శిబిరం వద్దకు చేరుకుంది. కొద్దిసేపు అక్కడే ఉండి అంగన్వాడీల నిరసనను తిలకించింది. అనంతరం అంగన్వాడీలు ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించింది. దీంతో సమ్మె చేస్తున్న అంగన్వాడీలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
Anganwadi Workers Strike : రాష్ట్ర వాప్తంగా అంగన్వాడీలు నిరవధిక సమ్మె 15 రోజులకు చేరిన అధికార ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. కనీసం వేతనం పెంపు, సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేఖారు. రిటైర్మెంట్ బెన్ఫిట్ 5 లక్షలు, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చ వరకు సమ్మెను విరమించుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.