Marriage ఆంధ్రా అబ్బాయి,ఫిలిప్పీన్స్ అమ్మాయి.. వివాహ వేడుక చూద్దాం రారండోయ్.. - Vetapalem Latest News
🎬 Watch Now: Feature Video
Andhra Boy and Philippines Girl Marriage: దేశం కాని దేశం.. అయినా పేమ వీరిని కలిపింది.. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. దీనికి బాపట్ల జిల్లా వేటపాలెంలోని ఒక చర్చి వేదికయింది. బాపట్ల జిల్లా అబ్బాయి, ఫిలిప్పీన్స్ అమ్మాయి ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడాా అనుకున్నారు.పెద్దలు కూడా వీరి వివాహానికి అంగీకరించటంతో ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వేటపాలెంకు చెందిన వరుడు పసుపులేటి వంశీ కృష్ణ బీటెక్ ఈఈఈ పూర్తిచేసి ఉద్యోగం కోసం 2019 సంవత్సరంలో ఫిలిప్పీన్స్ వెళ్ళాడు.
అక్కడ ఎలక్ట్రికల్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఇదే సమయంలో ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన గెరామిలినార్తో వంశీకృష్ణకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కరోనా సమయంలో వంశీకృష్ణ వేటపాలెంకు తిరిగి వచ్చేసాడు. కానీ వీరిద్దరూ నిత్యం ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. ఎట్టకేలకు పెద్దలు కూడా వారి పెళ్లికి అంగీకరించటంతో మూడు రోజుల క్రితం ఆ యువతి ఫిలిప్పీన్స్ నుంచి వేటపాలెం వచ్చింది. మిలినార్ ఫిలిప్పీన్స్లో నర్సింగ్ కోర్స్ చదువుతోంది. క్రైస్తవ మత సంప్రదాయాల ప్రకారం వేటపాలెంలోని సీయోను ప్రార్థన మందిరంలో వీరి వివాహం జరిగింది. వివాహానికి బంధువులు కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.