చాట్​బాట్​తో చోరీకి గురైన 6వేల సెల్​ఫోన్లను గుర్తించి.. బాధితులకు అందచేసిన పోలీసులు - అనంతపురం లేటెస్ట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 2, 2023, 6:41 PM IST

Anantapur District Chatbot Services: అనంతపురం జిల్లా పోలీసులు ఓ అరుదైన రికార్డ్​ను సృష్టించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సెల్ ఫోన్ పొగుట్టుకున్నా లేదా చోరీకి గురైన ఫోన్ల రికవరీ కోసం చాట్​బాట్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానం ద్వారా ఇప్పటి వరకు 6 వేలకు పైగా ఫోన్లను రికవరీ చేశారు. సాధారణంగా పొగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ కోసం.. గతంలో పోలీస్ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదులు చేసేవారు. అయినా కూడా అవి దొరుకుతాయన్న గ్యారెంటీ  ఉండేది కాదు. అయితే ఈ సమస్యపై జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఇలాంటి బాధితుల కోసం టెక్నికల్ టీం సాయంతో చాట్​బాట్ సేవలను తీసుకొచ్చారు. అంటే ఫోన్ పొగుట్టుకున్నా లేదా చోరీకి గురైనా.. పోలీస్ స్టేషన్​కు వెళ్లకుండా ఒక వాట్సప్ నెంబర్​కు మెసేజ్ చేసి వివరాలు పంపితే చాలు పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటారు. 

ఆ తరువాత బాధితుల ఫోన్ దేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్నా పోలీసులు వెతికి తీసుకొస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 6 వేల 26 ఫోన్లు రికవరీ చేశారు. వీటి విలువ సుమారు రూ. 9.75 కోట్లు ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. కేవలం అనంతపురం జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో మొబైల్స్ పోగొట్టుకున్న వారు కూడా అనంతపురం పోలీసులకు చాట్​బాట్ ద్వారా ఫిర్యాదులు చేశారు. అలాంటి వాటిని కూడా పోలీసులు రికవరీ చేశారు. ఇప్పటి వరకు 15 రాష్ట్రాలు, 18 జిల్లాల నుంచి ఫిర్యాదులు రాగా ఆయా రాష్ట్రాలవారి ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. ఈ సేవలు ఇప్పుడు రాష్ట్రంలోని పలు జిల్లాల పోలీసులు అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ విధానానికి జాతీయ స్థాయిలో అవార్డు కూడా వచ్చింది. దూర ప్రాంతాల్లో ఉన్న బాధితులకు కొరియర్ ద్వారా కూడా సెల్ ఫోన్లను పంపుతుండటం మరో విశేషం. ఈ సేవల్లో కష్టపడి పని చేస్తున్న వారిని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప అభినందించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.