Anam Venkataramana Reddy Allegations: 'లక్షషేర్ క్యాపిటల్ కంపెనీకి.. రూ.76 వేల కోట్ల ప్రాజెక్టులా..! అవన్నీ జగన్ బినామీ కంపెనీలే'
🎬 Watch Now: Feature Video
Anam Venkataramana Reddy allegations: లక్ష షేర్ క్యాపిటల్తొ పెట్టుబడి పెట్టిన కంపెనీకి ఏడు నెలల్లో... రూ.76 వేల కోట్ల ప్రాజెక్ట్లు ఎలా వస్తాయని తెలుగుదేశం నేత ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. వేల కోట్ల ప్రాజెక్ట్లు సొంతం చేసుకున్న ఇండోసోల్ కంపెనీ ఇడుపులపాయలో పుట్టిందన్నారు. ఈ కంపెనీ సీఎం జగన్మోహన్ రెడ్డి బినామీ అంటూ ఆరోపించారు. కోట్ల పెట్టుబడులు చేజిక్కించుకుంటున్న నర్రా విశవేశ్వర్ రెడ్ది, జగన్ బినామీ కాదా అంటూ వైసీపీని ప్రశ్నించారు. పెట్టుబడులు పెట్టిన ఐదు నెలల్లో ఇండోసోల్ నుంచి 49 శాతం షేర్లు అరబిందో గ్రూపు కొనేసిందని.. మిగిలిన వాటిల్లో షేర్లు కొనుగోలు కోసం మరో జాపనీస్ కంపెనీ వచ్చిందని ఆనం పేర్కొన్నారు. ఇది పెద్ద కుంభకోణం అంటూ ఆరోపించారు.
అవన్నీ జగన్ బినామీ కంపెనీలే... షిర్డీసాయి, అరబిందో, ఇండోసోల్... ఈ కంపెనీలన్నీ జగన్ బినామీ అని ఆనం ఆరోపించారు. అదానీ డిస్టలిరీస్ కూడా జగన్ బినామీ అని పేర్కొన్నారు. దొంగ కంపెనీలకు చంద్రబాబు పెట్టుబడులు ఇవ్వకపోవడమే చేసిన తప్పా అంటూ ఆనం ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు జైల్లో ఉన్నాడని.. రాష్ట్రాన్ని దోచుకున్న జగన్ రెడ్ది తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే షిర్డీ సాయి, అరబిందో, ఇండోసోల్ బూటకపు కంపెనీల పై విచారణ చేస్తామని ఆనం వెంకటరమణారెడ్డి హెచ్చరించారు.