Anam on YS Jagan ప్రజల డబ్బుతో యాగాలేంటీ..? హిందు ధర్మంతో ఈ రాజకీయాలేంటీ..? - ఆంధ్రప్రదేశ్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Anam Venkata Ramana Reddy Comments on Jagan: జగన్ సొంత డబ్బులతో యాగం చేసుకోవాలి గానీ ప్రజల డబ్బుతో యాగాలు చేసుకోవడంలో న్యాయం లేదని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి ధ్వజమెత్తారు. హిందువులు దేవాలయాలలో కానుకలు సమర్పించుకుంటే ఆ నిధులతో యాగాలు చేసుకోవడమేమిటని నిలదీశారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి.. యజ్ఞం చేస్తున్నట్లు ఆరోపించారు. భార్యా, భర్త కలిసి చేసేది యజ్ఞం అవుతుందని.. జగన్ భార్య భారతి హిందువు కాదు.. కావున ఆమె యాగానికి రాదని.. మరి జగన్ క్రిష్టియనా? హిందువా అని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన స్థలమైన స్మృతివనం వద్ద నారా లోకేష్ నివాళులర్పించడం టీడీపీ సంస్కృతికి నిదర్శనమన్నారు. అదే విధంగా తిరుమలలో నెలకొన్న వివాదాలపై స్పందించారు. ఎంతో చరిత్ర ఉన్న తిరుమలలో అసలు ఏం జరుగుతోందని ప్రశ్నించారు. వైసీపీ స్టిక్కర్లు, పోస్టర్లు తిరుమలలో అంటిస్తూ.. ప్రచారం చేసుకోవడాన్ని తప్పుబట్టారు. పవిత్రమైన తిరుమలలో రాజకీయాలు చేయడం, ప్రచారాలు చేసుకోవడం ఏంటని దుయ్యబట్టారు.