'పోలవరం' ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం - రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు: అంబటి రాంబాబు
🎬 Watch Now: Feature Video
Ambati Rambabu Comments on Polavaram Project : పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేనని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తేల్చారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో నాబార్డ్ నిధులతో (NABARD Funds) నిర్మించిన జడ్పీ ఉన్నత పాఠశాల భవనాన్ని, ఆడిటోరియాన్ని మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా (MLA Jakkampudi Raja), సత్తి సూర్య నారాయణరెడ్డితో (Satthi Surya Narayana Reddy) కలిసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా అనపర్తి వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో, ఎప్పుడు ప్రారంభిస్తామో చెప్పలేనని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని అంబటి రాంబాబు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిదే అని అంబటి రాంబాబు అన్నారు. కోరుకొండ మండల కాపవరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.