Farmers on R-5 zone: మోకాళ్లపై కూర్చుని రాజధాని రైతుల నిరసన
🎬 Watch Now: Feature Video
Amaravati farmers: ఆర్-5 జోన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లడాన్ని రాజధాని రైతులు తప్పుబడుతున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాజధాని గ్రామం కృష్ణాయపాలెంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆర్-5 జోన్ విషయంలో తము అభిప్రాయాలు పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై.. మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. రాజధాని రైతుల ప్లాట్ల అభివృద్ధిని పక్కన పెట్టిన ప్రభుత్వం...సెంటు భూమి ప్లాట్ల విషయంలో హడావిడి చేయడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఆర్-5 జోన్ అంశంలో ప్రభుత్వం ప్రజలు, రైతులకు మధ్య గొడవలు పెట్టాలని చూస్తోందని రైతులు ఆరోపించారు. ఇప్పటికే ఆర్-3 జోన్ అమలులో ఉందని.. అక్కడ కట్టిన టిడ్కో ఇళ్లను ఇవ్వడానికే గతిలేదని ఆరోపిస్తున్నారు. పేద ప్రజలకు ఇళ్లు ఇచ్చి, వారికి ఇక్కడ ఎలా ఉపాధి కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. తాము పేదలకు వ్యతిరేకమంటూ ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేస్తున్నారని రైతులు విమర్శించారు. బిల్డ్ అమరావతి, సేవ్ ఆధ్రప్రదేశ్ అనే నినాదంతో ముందుకు వెళ్లనున్నట్లు రాజధాని రైతులు తెలిపారు.