నవశకం ప్రాంగణంలో పండుగ వాతావరణం - ఆకర్షణీయంగా నేతల భారీ కటౌట్లు - Yuvagalam news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 20, 2023, 3:53 PM IST
All Arrangements Set For Yuvagalam Vijayotsava Sabha: యువగళం-నవశకం భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. విజయనగరం జిల్లా పోలిపల్లిలో నిర్వహిస్తున్న యువగళం విజయోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నవశకం ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. బెలూన్లు, డీజే చప్పుళ్లు, నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తుతోంది. వేదికపై ఉత్తరాంధ్ర సాంప్రదాయ కళా నృత్యాలు అలరిస్తున్నాయి. ప్రాంగణం అంతటా ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్, బాలకృష్ట భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు.
టీడీపీ- జనసేన కార్యకర్తల కేరింతలతో సభా ప్రాంగణంలో సందడి నెలకొంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి ఇరుపార్టీల నేతలు, కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. విశాఖ నుంచి సభ జరిగే పోలిపల్లి వరకు బ్యానర్లు, జెండాలు, ఫ్లెక్సీలతో జాతీయరహదారి కన్నుల పండువగా మారింది. రోడ్డుకు ఇరువైపులా ఎక్కడ చూసినా చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌ల కటౌట్లు కనిపిస్తున్నాయి. స్థానిక నాయకులు ఎక్కడికక్కడ తమ అభిమాన నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నవశకం వేదికవద్ద టీడీపీ-జనసేన నేతలు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ కార్యకర్తలకు సూచనలిస్తున్నారు.