సీఎం జగన్ కోర్టుకు హాజరై నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి : ఆలపాటి - ysrcp news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 11, 2024, 4:50 PM IST
Alapati Raja comments on CM Jagan : సీఎం జగన్ తనపై ఉన్న కేసుల విచారణకు సహకరించి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని మాజీ మంత్రి ఆలపాటి రాజా సవాల్ విసిరారు. న్యాయశాస్త్రంలోని లోసుగులను అడ్డం పెట్టుకుని చంద్రబాబుపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షనేతపై అక్రమ కేసులు బనాయించి నిర్భంధం చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. అధికారం ఉందని ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తేంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని పేర్కొన్నారు. అధికారం అడ్డుగా పెట్టుకొని ఉద్యోగులను, ప్రతిపక్షనేతలను ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారని ఉద్ఘాటించారు.
ఎక్కడ సహజవనరులు ఉంటే అక్కడ వైసీపీ నేతలు ఉంటారని ఆలపాటి రాజా వ్యాఖ్యానించారు. అధికార పార్టీలో 150 మంది ఎమ్యెల్యేలు ఉన్నారే కానీ ఏం సాధించారని ఆలపాటి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి రావణకాష్ఠగా మార్చారని పేర్కొన్నారు. వైసీపీ విధానాలను అత్యున్నత న్యాయస్థానం ఎన్ని సార్లు తప్పుపడిందని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పు చేశాడని నిరూపించడం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లే కాలేదని, 16 నెలలు జైల్లో ఉన్న సీఎం జగన్ వల్ల ఏమవుతుందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్పై కేసులున్నా కోర్టుకు వెళ్లకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు తనపైన ఉన్న కేసుల్లో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని వ్యాఖ్యానించారు. అక్రమంగా కేసులు బనాయిస్తే దొర దొంగవడు, దొంగ దొర కాలేడని పేర్కొన్నారు.