AISF Protest On Medical seats issue In Vijayawada ఉచితవిద్య అంటూ, మెడికల్ సీట్లను అమ్మడమేంటీ..? ఏఐఎస్​ఎఫ్​ నిరసన.. - విజయవాడ ధర్నా చౌక్​లో ఏఐఎస్​ఎఫ్​ నిరసన

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 5, 2023, 5:35 PM IST

AISF Protest On Medical seats issue: రాష్ట్రంలోని మెడికల్​ సీట్లను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించడాన్ని ఖండిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య  విజయవాడ ధర్నా చౌక్​లో నిరసన కార్యక్రమం చేపట్టింది.  డబ్బు దండుకోవడం కోసమే వైయస్సార్​ కాంగ్రెస్​ ప్రభుత్వం రాష్ట్రంలోని వైద్య కళాశాల్లో ఉన్న ఎంబీబీఎస్​ సీట్లను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించిందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సాయికుమార్ ఆరోపించారు. ప్రభుత్వం ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. ఈ జీవోను ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున్న ఆందోళనలు చేపడతామని సాయికుమార్​ హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి  ఉచితంగా విద్యను అందిస్తానని చెప్పిన సీఎం  మాట తప్పరని ఆయన అన్నారు.  అఖిల భారత విద్యార్థి సమాఖ్య చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి తమ పూర్తి సంఘీభావం తెలుపుతున్నట్లు పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ప్రకటించారు. సీఎం జగన్​ ఈ జీవోతో పేదవాడికి వైద్య విద్యను దూరం చేస్తున్నారని ఆయన విమర్శించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.