వైసీపీ ప్రభుత్వంలో రోజురోజుకూ పెరుగుతున్న కల్తీ మద్యం తయారీ, అమ్మకాలు - బండారు సత్యనారాయణ - former tdp leader bandaru
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 2, 2023, 4:45 PM IST
Adulterated Liquor in ysrcp Government: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కల్తీ మద్యం తయారీ, అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని టీడీపీ మాజీ నేత బండారు సత్యనారాయణ విమర్శించారు. జగన్ అధికారంలోకి రాగానే దశలవారీ మద్య నిషేధాన్ని అమలు చేస్తానని హోరెత్తించి మరిచారన్నారు. ప్రస్తుత మున్న మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించకుండా... నూతన మద్యం విధానం తెచ్చారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు వర్దంతి కార్యక్రమంలో బండారు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో దిగజారుడు, కుళ్లు రాజకీయాలు నడుస్తున్నాయన్నారు.
Bandaru satyanarayana comments : టీడీపీ అధినేత చంద్రబాబును బంధించి, తప్పుడు కేసులు బనాయించారని బండారు మండిపడ్డారు. సామాన్యులు సైతం జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారని అన్నారు. ఈ వారంలో చంద్రబాబు నాయుడు కేసులో కీలకమైన తీర్పు రాబోతుందని తెలిపారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు జైల్లో పెట్టినా తప్పు లేదని పేర్కొన్నారు.