'ఆడుదాం ఆంధ్ర' పోటీల్లో బాహాబాహీ- ఇరుజట్ల మధ్య తీవ్ర వాగ్వాదం - ఇరు జట్ల మధ్య వాగ్వాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 12, 2024, 8:50 AM IST

Adudham Andhra Competition Was Both Teams in Controversy: అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన 'ఆడుదాం ఆంధ్ర' పోటీల్లో ఇరు జట్లు బాహాబాహీకి దిగాయి. ప్రధానంగా మండలంలోని రాయదుర్గం కోటవీధి, జుంజురంపల్లి  గ్రామాల జట్లు మధ్య కబడ్డీ పోటీ జరిగింది. పాయింట్ల విషయంలో ఇరుజట్ల క్రీడాకారుల మధ్య వివాదం చోటుచేసుకుంది. అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ క్రీడాకారులు గొడవకు దిగారు. కాసేపటికి గొడవ కాస్త ముదిరి తారస్థాయికి చేరుకుంది. 

ఇరుజట్ల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో క్రీడా మైదానంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంపైర్లు, పీడీలు, ఉపాధ్యాయులు, అధికారులు ఎంత వారించిన కూడా అలజడి మాత్రం ఆగలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే జోక్యం చేసుకొని ఇరు జట్లను చెదరగొట్టారు. దీంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. ఈ క్రీడా పోటీల కారణంగా ఇరు గ్రామాల మధ్య గొడవలు జరుగుతున్నాయని ప్రజలు, విద్యార్థులు, క్రీడాకారులు ఆందోళనకు గురవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.