Nannaya University students protest : కాషన్ డిపాజిట్ చెల్లించాలంటూ విద్యార్థుల ఆందోళన - rajahmundry latest news
🎬 Watch Now: Feature Video
Students protest to pay caution deposit : రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం యాజమాన్యం గతంలో హాస్టల్ విద్యార్థులకు ఇచ్చిన హామీ ప్రకారం 75 శాతం కాషన్ డిపాజిట్‌ను తిరిగి చెల్లించాలని కోరుతూ హాస్టల్ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వీసి ఛాంబర్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఉదయం నుంచి యాజమాన్యం వివిధ దశలలో విద్యార్థులతో చర్చలు నిర్వహించి విఫలం అయ్యాయి. దీంతో గత్యంతరం లేక విద్యార్థుల ఆందోళనకు దిగాల్సి వచ్చిందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్. రాజారత్నకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు డి. అశోక్ కుమార్, నాయకులు గంగిరెడ్డి ప్రవళిక మాట్లాడుతూ... గతంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ ఇప్పుడు దాన్ని అమలు చేయకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఉదయం నుంచి యాజమాన్యం విద్యార్థులను మభ్యపెడుతూ వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం స్పందించి పరిష్కారం చూపే వరకు ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ విద్యార్థులు పాల్గొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.