ప్రస్తుత పరిస్థితుల్లో.. వైసీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలి : నారా రోహిత్ - 50th day of yuvagalm
🎬 Watch Now: Feature Video
Nara Rohit in Yuvagalam Padayatra : రానున్న శాసనసభ సాధారణ ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పటం హస్యాస్పదంగా ఉందని నటుడు నారా రోహిత్ అన్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోదరుడు నారా రోహిత్ యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 50 రోజుకు చేరుకున్న సందర్భంగా నారా రోహిత్ పాదయాత్రలో పాల్గొని అభినందనలు తెలిపారు. సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో కొనసాగిన పాదయాత్రలో నారా రోహిత్ పాల్గొనటంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది.
ప్రజలలో యువగళం పాదయాత్రకు పెరుగుతున్న ఆదరణ చాలా సంతోషకరమని నారా రోహిత్ అన్నారు. మార్పు మొదలైందని.. ఇటీవల వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతోనే తెలుస్తుందన్నారు. చంద్రబాబు పాలనకు, అధికార వైసీపీ పాలనకు మధ్య వ్యత్యాసం ప్రజలకు తెలిసిందని వివరించారు. వైసీపీ అంటున్న వైనాట్ 175 అంటే వారికే తెలియాలని.. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావటం, ఎమ్మెల్యేలలో అసంతృప్తి వ్యక్తమవుతున్న తరుణంలో వైసీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని పేర్కొన్నారు.