శ్రీవారి సేవలో నటి కీర్తి సురేశ్.. ఆశీర్వచనం చేసిన వేదపండితులు - భోళా శంకరుడు చిత్రం
🎬 Watch Now: Feature Video
Actor Keerthi Suresh: తిరుమల శ్రీవారిని సినీ నటి కీర్తి సురేశ్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో శనివారం రోజున పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ అధికారులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న ఆమెకు రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. నటి కీర్తి సురశ్కు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత శ్రీవారి దర్శనానికి వచ్చానన్నారు. స్వామివారిని దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న భోళా శంకరుడు చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. ఆమె శ్రీవారి దర్శననానికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు.. అక్కడికి తరలి రావటంతో ఆలయ ఆవరణం సందడిగా మారింది. అంతేకాకుండా సమీపంలో ఉన్న భక్తులు పెద్ద సంఖ్యలో ఆమె దగ్గరకు చేరుకున్నారు.