లోకేశ్ వారసుడు కాదు రాజకీయ నాయకుడని ఆరోజే చెప్పా : అచ్చెన్నాయుడు - టీడీపీ అచ్చెన్నాయుడు లేటెస్ట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2023, 7:17 PM IST

Achannaidu Comments in Yuvagalam Vijayotsava Sabha: లోకేశ్ వారసుడు కాదు రాజకీయ నాయకుడని ఆరోజే చెప్పానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. నేల ఈనిందా, ఆకాశం చిల్లుపడిందా అన్నట్లు యువగళం విజయోత్సవ సభ ఉందని పేర్కొన్నారు. లోకేశ్ నాయకుడే కాదు పోరాటయోధుడు కూడా అని అన్నారు. నాడు జగన్‌ పాదయాత్రకు ఆటంకాలు కలగలేదన్న ఆయన లోకేశ్ పాదయాత్రకు మాత్రం వైఎస్సార్సీపీ సర్కారు ఎన్నో అడ్డంకులు సృష్టించిందని ధ్వజమెత్తారు. లోకేశ్ చేపట్టిన యాత్ర యువగళం కాదని, ప్రజాగళమని నిరూపించారన్నారు. పాదయాత్రలో భాగంగా యువనేత లోకేశ్ ప్రభుత్వ తప్పులు, అవినీతిని ఎండగట్టారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

TDP Achannaidu at Yuvagalam Vijayotsava Sabha: టీడీపీ -జనసేనను బలహీనవర్గాలకు దూరం చేయాలని కుట్ర పన్నిన జగన్ కొత్త నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మొత్తం దోచేశారని దుయ్యబట్టారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధికి వైఎస్సార్సీపీ సర్కారు యత్నిస్తుందన్న ఆయన టీడీపీ-జనసేన కలిసి పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. రాష్ట్రానికి పట్టిన శనిని బంగాళాఖాతంలో కలపాలని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును పునర్నిర్మించుకునేందుకు టీడీపీ-జనసేన కూటమిని ఆదరించాలని అచ్చెన్నాయుడు కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.