చికుబుకు చికుబుకు బుల్లి రైలే అదిరెను దీని స్టైలే
🎬 Watch Now: Feature Video
Road train in Nirmal : తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ బుల్లి రైలు సందడి చేసింది. అదేంటి, నిర్మల్‌కి రైలు మార్గం లేదు కదా రైలు ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారా! చిన్న టైర్లతో నడిచే రైలును పోలిన వాహనం అది. ఓ ప్రైవేటు పాఠశాల వినూత్నంగా ఆలోచించి రెండు బోగీలతో చిన్న రైలును తయారు చేశారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఓ ప్రైవేటు పాఠశాల వారు ప్రధాన రహదారిపై నడిపించిన ఈ బుల్లి రైలును అందరూ ఆసక్తిగా చూశారు.
కొందరు ఉత్సాహంగా స్వీయ చిత్రాలు తీసుకున్నారు. ఈ బుల్లి రైలులో పాఠశాలకు చెందిన వ్యక్తులు ప్రయాణించారు. జిల్లాకు రైలు మార్గం వస్తే ప్రయాణిద్దాం అనుకొని ఆశ చెందిన కొంత మంది ప్రయాణికులకు ఈ రైలు ఆనందాన్ని కలిగించింది. ఎన్నో ఏళ్లుగా జిల్లా వాసులకున్న రైలు కల తాత్కాలికంగానైనా తీరిందంటూ పలువురు ఆనందం వ్యక్తం చేశారు.