304 kgs ganja seized : గన్నవరంలో 304 కేజీలు, నెల్లూరులో వంద కిలోల గంజాయి పట్టివేత
🎬 Watch Now: Feature Video
Gannavaram police seized ganja : పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు ఆగడం లేదు. ఏదో ఒక రకంగా అక్రమంగా గంజాయి, ఇతర మత్త పదార్థాలు తరలిస్తున్నారు. ఎన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా.. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చివరకు ఎక్కడో ఒక చోట పట్టుబడుతున్నారు. తాజాగా గుట్టుచప్పుడు కాకుండా ఆటోలో భారీగా తరలిస్తున్న గంజాయిని కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు పట్టుకున్నారు. చిన్న అవుటపల్లి వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. గన్నవరం డీఎస్పీ జయ సూర్య తెలిపిన వివరాల ప్రకారం... గూడ్స్ ఆటోలో తరలిస్తున్న 304 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితులు చిత్తూరు జిల్లాకు చెందిన మల్లెల రాజమ్మ, మల్లెల వెంకటరమణ, ఆవుల సంతోష్ అలియాస్ శివ, ఆవుల లక్ష్మీ అలియాస్ నందినిలుగా గుర్తించినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి సుమారు రూ. 60 లక్షలు విలువ చేసే 304 కేజీల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లు, ఒక ట్రక్ ఆటో ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి చిత్తూరు జిల్లా పుంగనూరు తీసుకుని వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
నెల్లూరు జిల్లా కావలిలో వంద కిలోల గంజాయి స్వాధీనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 19 మందిని అరెస్టు చేసినట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. మరో ఇద్దరు పరారయ్యారని.. వారి కోసం గాలింపు చేపట్టినట్లు వివరించారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.50 లక్షలు ఉంటుందని వెల్లడించారు.