పెయింటర్లపై మహిళ క్రూరత్వం- 26 అంతస్తుల ఎత్తులో ఉండగా తాడును కోసేసి.. - thailand painters news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 28, 2021, 7:46 PM IST

ఇద్దరు పెయింటర్లు ఎత్తైన బహుళ అంతస్తుల బిల్డింగ్‌కు ఓ చోట పెయింట్‌ వేస్తుండగా ఒక మహిళ తన ఇంటి మీదుగా వెళ్తున్న సపోర్ట్‌ తాడును కోసేసింది. దీంతో ఇద్దరు 26వ అంతస్తు పైనుంచి ప్రమాదకరంగా గాల్లో వేలాడసాగారు. సహాయం చేయాలని అరవగా చూసిన ఓ జంట.. తమ బాల్కనీలోకి వారిని అనుమతించింది. అలా ప్రాణాలు కాపాడుకున్నారు. థాయిలాండ్‌లోని నోంతాబురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది. బతికుండగానే పెయింటర్లకు చావును చూపిన ఆ మహిళ హత్యాయత్నం కేసులో అరెస్టయింది. ఆ రోజు పెయింటింగ్​ వేస్తున్నట్లు సమాచారం లేదని, ఒక్కసారిగా కిటికీలోనుంచి ఇద్దరు కనిపించగా విసుగు చెంది ఆ పని చేసినట్లు మహిళ ఒప్పుకుంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.