1100ఏళ్ల నాటి బంగారు నాణేలు లభ్యం - 1100ఏళ్ల క్రితం నాటి బంగారు నాణేలు
🎬 Watch Now: Feature Video
ఇజ్రాయెల్‌లో జరుగుతున్న పురావస్తు తవ్వకాల్లో 11వందల ఏళ్ల నాటి అమూల్యమైన బంగారు నాణెలు బయటపడ్డాయి. పురాతన వస్తువుల వెలికితీతలో భాగంగా.. తవ్వకాలు జరుపుతున్న క్రమంలో వీటిని గుర్తించినట్లు ఇజ్రాయెల్ పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. మెుత్తం 425 బంగారు నాణెలు బయటపడ్డట్లు చెప్పారు. ఆ నాణేలు 9వ శతాబ్దానికి చెందిన అబ్బాసిద్ కాలిఫెట్ కాలానికి చెందినవిగా అంచనా వేస్తున్నారు అధికారులు. 1100 ఏళ్ల క్రితం భూమిలో పాతిపెట్టినట్లు చెబుతున్నారు. ఇవి ఎంతో విలువైన పురాతన సంపద అని వారు అభివర్ణించారు.