PRATIDWANI: రాష్ట్రం అప్పుల తిప్పల్లో కొత్త సమస్యలు.. రూ.12,427 కోట్ల విద్యుత్ బకాయిలు - power debts
🎬 Watch Now: Feature Video
రాష్ట్రానికి.. అప్పుల తిప్పలు కొత్త సమస్యలను తెచ్చి పెడుతున్నాయి. నిన్నటి వరకు రాజకీయ విమర్శలు - ప్రతివిమర్శలకే పరిమితమైన ఈ విషయంలో ఊహించని పరిణామాలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు.. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి వచ్చిన లేఖ... బకాయిల వసూళ్ల విషయమై.. ఆ సంస్థ ఉన్నతాధికారులే తరలి రావడం సమస్య తీవ్రతకు అద్ధం పడుతోంది. ఏపీ జెన్‌కో, ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లు ఇప్పుడు దివాలా ముప్పులో పడే వరకు వచ్చింది పరిస్థితి. అసలు.. ప్రభుత్వ రంగం సంస్థలకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? రాష్ట్ర విద్యుత్ రంగంపై ఉన్న అప్పుల భారం ఎంత? ఎందుకు తీర్చలేకపోతున్నారు.. ఫలితంగా రానున్న రోజుల్లో ఎలాంటి పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.