prathidwani: పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతుల.. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? - guidelines of online classes at schools
🎬 Watch Now: Feature Video
సుదీర్ఘ విరామం తర్వాత కరోనా భయాల మధ్యనే తెలంగాణలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలు, మార్గదర్శకాలు కట్టుదిట్టంగా అమలు చేయాలన్న ప్రభుత్వ సూచనలతో ప్రభుత్వ పాఠశాలలు సమాయత్తం అయ్యాయి. ప్రైవేటు పాఠాశాలలు సైతం ప్రత్యక్ష బోధనకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పదిహేను రోజులుగా ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల హాజరు పెంచుకుంటూ, తల్లిదండ్రుల విశ్వాసాన్ని చూరగొనేందుకు పాఠశాలల యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యక్ష బోధన అమలు విధివిధానాల గురింంచి ఈరోజు ప్రతిధ్వని.