చిరంజీవి కాంట్రవర్సీ కామెంట్స్‌పై దిల్ రాజు రియాక్షన్.. ఏమన్నారంటే? - chiranjeevi comments on ap government
🎬 Watch Now: Feature Video
Producer Dilraju reacts on Chiranjeevi controversy : మెగాస్టార్ చిరంజీవి మంచి ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు అన్నారు. సానుకూల థృక్పథంతో ఉంటే అన్ని అర్థమవుతాయని పేర్కొన్నారు. ఇటీవల నటీనటుల రెమ్యునరేషన్లపై ఏపీ ఎంపీలు పార్లమెంట్ లో ప్రస్తావించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో చిరంజీవి వ్యాఖ్యలపై రజినీకాంత్ నటించిన జైలర్ సక్సెస్ మీట్లో స్పందించిన దిల్ రాజు.. చిరంజీవి వీడియోను పూర్తిగా చూడలేదని, ఆయన మంచి ఉద్దేశంతో చెప్పిన మాటలను స్వీకరించే విధానం తప్పుగా ఉందన్నారు. నెగిటివ్‌గా తీసుకోకుండా పాజిటివ్‌గా ఉండాలని దిల్ రాజు కోరారు.
దిల్‌రాజుతో సినిమా.. త్వరలోనే మెగా స్టార్ చిరంజీవితో దిల్‌రాజు ఓ సినిమా చేయబోతున్నారని ఈ మధ్యే వార్తలు వచ్చాయి. త్వరలోనే దిల్‌రాజు బ్యానర్ పై చిరు ఓ సినిమా చేస్తారని, ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని ఆ కథనాల్లో రాసి ఉంది. ఇకపోతే ఈ సినిమాకు ఫన్ డైెరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తారని అంతా మాట్లాడుకున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..
Chiranjeevi Comments on Government Full Video: ఆ రోజు చిరంజీవి ఏమన్నారంటే..! పూర్తి వీడియో