తిరుమల గిరిలో సరికొత్త శోభ - కనువిందు చేస్తున్న కపిలతీర్థం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 4, 2023, 10:13 PM IST
Impressive Waterfalls in Seshachalam Forest area Due to Rains: తిరుమల గిరిలో సరికొత్త శోభ సంతరించుకొంది. గడచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలతో మొదటి కనుమ రహదారిలో ఉన్న మాల్వాడి గుండం జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అలిపిరిలో శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిలతీర్థ జలపాతం భక్తులకు కనువిందు చేస్తోంది. నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పుష్కరిణిలో భక్తులను స్నానానికి అనుమతించడం లేదు. ఏడుకొండల్లో పరచుకున్న పచ్చదనానికి ఎత్తైన ప్రాంతం నుంచి జారుతున్న జలపాతం తోడవటంతో భక్తులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి.
Heavy rains in Tirumala due to Michaung Cyclone: మిగ్‌జాం తుపాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఘాట్ రోడ్డులు, తిరుమల స్వామివారి సన్నిధి తడిచి ముద్దయింది. ఆలయ పరిసరాల ప్రాంతాలు జలమయయ్యాయి. శ్రీవారి దర్శన అనంతరం విశ్రాంతి నిలయంకు, లడ్డూ వితరణ శాలకు వెళ్లేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా చంటి పిల్లలు, వృద్దులు టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద తలదాచుకుంటున్నారు. ఘాట్ రోడ్డలో ప్రయాణించే భక్తులను అప్రమత్తం చేస్తూ రోడ్లపై పడిన కొండచరియలను ఎప్పటికప్పుడు టీటీడీ సిబ్బంది తొలగిస్తున్నారు. తిరుమలలో భక్తుల నీటి అవసరాలను తీర్చే మొదటి గోగర్భం జలాశయంకు నీటి మట్టం పెరిగింది. ఏ క్షణమైనా గేట్లు ఎత్తివేసేందుకు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసింది. పాపవినాశనం, ఆకాశ గంగ, శిలతోరణం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను టీటీడీ ముందస్తుగా మూసివేసింది.