PRATIDWANI: సామాన్యుల సొంతింటి కల.. నిరీక్షణకు ముగింపు పలికేలా..? - స్థిరాస్తి బిల్డర్లపై ప్రతిధ్వనిలో చర్చ
🎬 Watch Now: Feature Video
సొంత ఇల్లు.. సామాన్యుల జీవిత కాలపు కల. ఆ కల నిజం చేసుకోవడానికి రూపాయి రూపాయి పొదుపు చేసి, ఇరవై, ముప్పై ఏళ్లు కూడబెట్టిన కష్టార్జితాన్ని స్థిరాస్తి బిల్డర్ చేతుల్లో పోస్తున్నారు రియల్ ఎస్టేట్ కస్టమర్లు. మరో ఇరవై, పాతికేళ్ల పాటు తీర్చాల్సిన అప్పులు చేసి, ధనమంతా గుత్తేదారుకు అర్పిస్తున్నారు. ఏడాదో, రెండేళ్లో గడువు పెట్టుకుని గృహప్రవేశం చేసేందుకు ఆశగా ఎదురు చూస్తుంటారు. కానీ.. వీరి ఆశలు అడియాశలే అవుతున్నాయి. సకాలంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని ఒప్పందం చేసుకున్న రియల్ వ్యాపారులు ఎప్పటికప్పుడు కొత్త గడువులు పెడుతూ.. దాటవేస్తున్నారు. ఏళ్లకేళ్లు గడుస్తున్నా, కళ్లు కాయలుకాసేలా ఎదురు చూడటమే తప్ప.. గట్టిగా నిలదీయలేని నిస్సహాయ స్థితి సామాన్యులది. ఇలాంటి వారి నిరీక్షణకు ముగింపు పలికేలా దేశవ్యాప్తంగా వర్తించే సమర్థ ఒప్పంద నమూనా రూపొందించాలంటూ సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సూచించిన నేపథ్యంలో ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ..