ETV Bharat / state

సీఎం చంద్రబాబు సెక్యూరిటీలో మార్పులు - రంగంలోకి కౌంటర్‌ యాక్షన్‌ టీమ్​లు - CHANGES IN CM CHANDRABABU SECURITY

స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌(SPG) శిక్షణలో రాటుదేలిన కమాండోలు - సీఎంపై దాడిని సమర్థంగా ఎదుర్కోవడంపై దృష్టి

Changes in CM Chandrababu Security
Changes in CM Chandrababu Security (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2025, 10:54 AM IST

Changes in CM Chandrababu Security : ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతను పర్యవేక్షించే స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌ (SSG)లో ఇటీవల పలు మార్పులు జరిగాయి. సీఎం భద్రతా వలయంలోకి కొత్తగా కౌంటర్‌ యాక్షన్‌ బృందాలు వచ్చి చేరాయి. సీఎంకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఎస్‌ఎస్‌జీ సిబ్బంది, బ్లాక్‌ క్యాట్‌ కమాండోలకు అదనంగా ఈ కౌంటర్‌ యాక్షన్‌ బృందాలూ ఇప్పుడు రక్షణలో ఉంటాయి. ముఖ్యమంత్రి రక్షణ విషయంలో రాజీపడకుండా, భద్రత కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కౌంటర్‌ యాక్షన్‌ బృందంలోని ఆరుగురు కమాండోలు విధుల్లో ఉంటారు.

మూడంచెల భద్రత : సాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడంచెల భద్రత ఉంటుంది. తొలి వలయంలో ఎన్‌ఎస్‌జీ(NSG), రెండో వలయంలో ఎస్‌ఎస్‌జీ(SSG), అలాగే వివిధ చోట్ల పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి పోలీసు యూనిట్లకు చెందిన సాయుధ బలగాలు మూడో వలయంగా ఉంటాయి. వీరందరితో పాటు ముఖ్యమంత్రికి కొద్ది దూరంలో నిత్యం వెన్నంటి ఆరుగురు కౌంటర్‌ యాక్షన్‌ కమాండోలు సైతం ఉంటారు. ఏదైనా ఆపద సమయంలో మొదటి, రెండో వలయంలోని సిబ్బంది సీఎంను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తే, అక్కడి కౌంటర్‌ యాక్షన్‌ టీమ్‌ బయటి నుంచి దాడి చేసే వారిని సమర్థంగా ఎదుర్కోవడంపై దృష్టి పెడుతుంది.

శిక్షణలో రాటుదేలిన కమాండోలు : దేశ ప్రధాని భద్రతను నిత్యం పర్యవేక్షించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (SPG) శిక్షణలో ఈ కౌంటర్‌ యాక్షన్‌ కమాండోలు రాటుదేేలారు. వీరికి ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌నూ సైతం అమలు చేస్తున్నారు. ముదురు గోధుమ రంగు ప్యాంటు, నలుపు రంగు చొక్కాలను ఈ కమాండోలు ధరిస్తారు. వీరి చొక్కాకు ముందు, వెనుక వైపున SSG అనే ఆంగ్ల అక్షరాలు కనిపిస్తాయి.

చంద్రబాబు సెక్యూరిటీ డ్యూటీలోకి అటానమస్ డ్రోన్- సీఎం భద్రత భారీగా కుదింపు

సీఎం ర్యాలీలో భద్రతా వైఫల్యం- ఏకంగా గన్​ను అక్కడ పెట్టుకొని పూలమాలలు వేసిన కార్యకర్త!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.