ప్రతిధ్వని: ప్రైవేటు ఆసుపత్రుల నియంత్రణకు ప్రత్యేక చట్టం రాబోతుందా?! - ఈటీవీ ప్రత్యేక చర్చ
🎬 Watch Now: Feature Video
ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రజారోగ్య చట్టాన్ని తీసుకురావాలని హోంశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్రానికి సిఫారస్సు చేసింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి కాలంలో రోగులు భయంతో వైద్యం కోసం అనవసర ఖర్చులు చేయకుండా.. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో మందులు లభించేలా చూడాలని సూచించింది. వాస్తవానికి దేశంలో వైద్యానికి చేస్తున్న ఖర్చుల వల్ల ఏటా 6 కోట్ల మంది పేదరికంలోకి జారిపోతున్నారు. జీడీపీలో వైద్య రంగానికి కేంద్రం కేటాయిస్తున్నది 1.3 శాతం మాత్రమే. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి దృష్టి సారించాలనే అంశంపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చ..