గంగమ్మ ఒడిలో..'ప్రధాని మోదీ' పడవ విహారం - ganga river pm modi
🎬 Watch Now: Feature Video
ప్రధాని నరేంద్రమోదీ గంగానదీలో విహరించారు. కాన్పూర్లో జరిగిన జాతీయ గంగానది కౌన్సిల్ తొలి సమీక్షలో పాల్గొన్న సందర్భంగా.. గంగానదీ ప్రక్షాళన పనులను పరిశీలించారు. అనంతరం అటల్ ఘాట్ నుంచి గంగానదీలో పడవ ప్రయాణం చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం టీఎస్ రావత్, బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ తదితరుల పడవ విహారంలో పాలుపంచుకున్నారు.