పెళ్లి ఊరేగింపులో కత్తి, కర్రసాముతో అదరగొట్టిన వధువు - నిషా మార్షల్ ఆర్ట్స్ వీడియో
🎬 Watch Now: Feature Video
తమిళనాడులోని తూత్తుకుడిలో ఓ వధువు చేసిన ఫీట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి. పెళ్లి తరువాత నిర్వహించిన ఊరేగింపులో ఆత్మరక్షణ విద్యకు సంబంధించిన కత్తి, కర్ర సాములు చేసి ఆ నవ వధువు అదరకొట్టింది. చిన్ననాటి నుంచే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్న నిషా అనే యువతి.. పెళ్లి రోజున అందరికి గుర్తుండిపోయేలా ఫీట్లు చేసి అలరించింది. అయితే మహిళలకు ఆత్మరక్షణ విద్యపై అవగాహన కల్పించేందుకు ఇలా చేసినట్లు తెలిపింది.