పాటలు పాడుతూ పాఠశాల శుభ్రం.. విద్యార్థులకు స్వచ్ఛతపై అవగాహన - పాటలతో విద్యార్థులను స్వచ్ఛతలో భాగం చేసిన టీచర్
🎬 Watch Now: Feature Video
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరీలో పాఠశాలను శుభ్రం చేసేందుకు నడుంకట్టిన ఓ టీచర్.. విద్యార్థులనూ అందులో భాగం చేశారు. పాటతో విద్యార్థులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. దీంతో విద్యార్థులు సైతం ఉల్లాసంగా స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇశానగర్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ అయిన కమల్ కుమార్ మిశ్రా... విద్యార్థులకు స్వచ్ఛ భారత్‌పై అవగాహన కల్పించేందుకే ఇలా చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయన చేస్తున్న పనికి పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST