జావెలిన్ త్రో ప్రాక్టీస్‌లో అపశ్రుతి విద్యార్థి మెడలోకి చొచ్చుకెళ్లిన స్టిక్ - స్టూడెంట్ మెడలో ఇరుకున్న జావెలిన్ స్టిక్
🎬 Watch Now: Feature Video

ఒడిశాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో శనివారం ప్రమాదవశాత్తు ఓ విద్యార్థి మెడలోకి జావెలిన్ స్టిక్ దూసుకెళ్లింది. స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే స్పోర్ట్స్ ఈవెంట్స్ కోసం ఓ విద్యార్థి జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతడు విసిరిన స్టిక్ అక్కడే ఉన్న 9వ తరగతి విద్యార్థి సదానంద్ మెహర్ మెడలోకి చొచ్చుకుపోయింది. గాయపడిన విద్యార్థిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది పాఠశాల యాజమాన్యం. జావెలిన్ స్టిక్‌ను తొలగించేందుకు ప్రత్యేక డాక్టర్ల బృందం తీవ్రంగా శ్రమించింది. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి నిలకడగానే ఉందని తెలిసింది.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST