మార్నింగ్ వాక్ చేస్తుండగా ఢీకొట్టిన బొలెరో.. పక్కకు తప్పుకునే ప్రయత్నం చేసినా.. - అహ్మదాబాద్ గుజరాత్ యాక్సిడెంట్
🎬 Watch Now: Feature Video
Gujarat Ahmedabad hit and run: మార్నింగ్ వాక్కు వెళ్లిన ఓ వ్యక్తిని బొలెరో వాహనం ఢీకొట్టింది. వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టడం వల్ల తీవ్రగాయాలతో బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గుజరాత్లోని అహ్మదాబాద్లో శుక్రవారం ఉదయం 6 గంటలకు ఈ ఘటన జరిగింది. బాధితుడు శైలేష్ ప్రజాపతి రోడ్డు పక్కనే నడుస్తున్నాడు. బొలెరో రావడాన్ని గమనించి మరింత పక్కకు జరిగాడు. అయితే, వాహనం అతడివైపే దూసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఘటన తర్వాత వాహన డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST