గాజుల అలంకరణలో కొలువుదీరిన కనక దుర్గమ్మ - జగన్మాతకు గాజుల అలంకారం
🎬 Watch Now: Feature Video
Bangles Decoration : ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారు గాజుల అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. కార్తీకమాసం రెండో రోజున జగన్మాతకు గాజుల అలంకారం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఉపాలయాలను వివిధ రంగుల గాజులతో.. సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఈ గాజులను దేవస్థానానికి దాతలు అందజేశారు. వివిధ రంగుల గాజుల అలంకరణతో.. సౌభాగ్యవతిగా వెలిగిపోతున్న దుర్గమ్మను భక్తులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకుంటున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST