మరుగుజ్జుల పెళ్లి.. 36 అంగుళాల వరుడు.. 31 అంగుళాల వధువు - మరుగుజ్జుల పెళ్లి మహారాష్ట్ర
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15412055-1056-15412055-1653745304668.jpg)
Dwarf marriage in Jalgaon: మహారాష్ట్రలోని జల్గావ్లో మరుగుజ్జుల వివాహం చర్చనీయాంశంగా మారింది. శనిపేటలోని చౌగులేకు చెందిన సందీప్ సప్కాలే (36 అంగుళాల పొడవు), ధూలె గ్రామానికి చెందిన ఉజ్వల(31 అంగుళాలు) వివాహం వైభవంగా జరిగింది. ఎత్తు తక్కువగా ఉండటం వల్ల సందీప్ సప్కాలేకు వధువును వెతకడం కష్టమైపోయిందని.. అతడి తల్లి పేర్కొన్నారు. చాలా రోజుల తర్వాత ఉజ్వల గురించి తెలిసిందని అన్నారు. ఆమెను సొంత కూతురిలా చూసుకుంటానని చెబుతున్నారు. ఈ వివాహాన్ని చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తారు. వధూవరులతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST