'నా కోడిని చంపేశారు... న్యాయం చేయండి' - కోడిని చంపినందుకు న్యాయం చేయాలని వ్యక్తి డిమాండ్
🎬 Watch Now: Feature Video
హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనాలో ఓ వ్యక్తి వింత ప్రవర్తన వైరల్ గా మారింది. తన కోడిని ఇంటి పక్కన ఉన్న వారు చంపేశారని.. తనకు న్యాయం చేయాలని ఏకంగా కలెక్టర్ ఆఫీస్‌కు వచ్చాడు. పొరిగింటి వారు కావాలనే విషం పెట్టి చంపేసినట్లు విలపించాడు. తనకు న్యాయం చేయాలని బోరున విలపిస్తూ వేడుకున్నాడు. చనిపోయిన కోడితో వచ్చిన ఆ వ్యక్తిని చూసేందుకు జనం గుమిగూడారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఫిర్యాదుదారుడ్ని వెంట తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడ్ని బిహార్‌కు చెంది రాజేశ్ రాయ్‌గా గుర్తించారు.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST