T20 World Cup : పాకిస్థాన్‌పై అద్భుత విజయంతో టీ20 వరల్డ్ కప్‌ను ఆరంభించింది టీమ్ఇండియా. అనంతరం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఇప్పుడు పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు జరగబోయే మ్యాచ్‌లో గెలిచి హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకోవాలనుకుటోంది టీమ్ఇండియా. ఈ ఆశలకు వరుణుడు అడ్డం వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆదివారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ మ్యాచ్ జరిగే సమయం మొత్తం వర్షం ఉండదని చెబుతున్నారు. ఇప్పటి వరకు వర్షం కారణంగా ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచ్‌లు రద్దయ్యాయి. అయితే ఇక్కడ గత మూడు రోజుల నుంచి వర్షం కురుస్తోంది. బౌన్స్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై జరిగిన 21 మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన వారు 13 మ్యాచ్‌ల్లో గెలిచారని గణాంకాలు చెబుతున్నాయి. దక్షిణాఫ్రికా, టీమ్ ఇండియా రెండూ టైటిల్ రేసులో ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలవడం రెండు జట్లుకు చాలా ముఖ్యం. అయితే ఈ మెగా టోర్నీలో వర్షం కారణంగా కొన్ని జట్ల స్థానాలు అనూహ్యంగా మారడం గమనార్హం.
"ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం, సాయంత్రం వర్షం పడే అవకాశాలు 50 శాతం ఉన్నాయి. గాలి వేగం ప్రతి గంటకు 25 నుంచి 35 కిలోమీటర్లు ఉంటుంది. ఇది 45 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్, తేమ 49 శాతంగా ఉంటుంది" అని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ వెల్లడించింది.
సూపర్ 12 దశ ముగిసే సరికి పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాల్లో ఉన్న టీమ్‌లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్-2 నుంచి టేబుల్లో మొదటి స్థానం కోసం భారత్, దక్షిణాఫ్రికా జట్లు పోటీపడుతున్నాయి. భారత్.. పాక్, నెదర్లాండ్స్‌పై గెలిచి మూడో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇక దక్షిణాఫ్రికా మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్‌పై నెగ్గి.. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వర్షం కారణంగా పాయింట్లను పంచుకుంది.
ఇవీ చదవండి : టీమ్ఇండియా విజయం కోసం పాకిస్థాన్ ప్రార్థనలు.. ఎప్పుడైనా చూశారా..?