ETV Bharat / t20-world-cup-2022

సిడ్నీలో ఫైనల్‌ వేట.. సెమీస్​ పోరుకు పాక్​, కివీస్ రెడీ - ఐసీసీ టీ20 ప్రపంచకప్​ లేటెస్ట్ న్యూస్

ఒక జట్టు అస్థిరతకు చిరునామా.. ఇంకో జట్టు నిలకడకు పెట్టింది పేరు. ఓ జట్టు చచ్చీ చెడీ, అదృష్టం తోడై అనూహ్యంగా సెమీస్‌ చేరితే.. మరో జట్టు చక్కని ప్రదర్శనతో గ్రూప్‌ టాపర్‌గా నాకౌట్లో అడుగుపెట్టింది. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ మధ్య సెమీఫైనల్‌ నేడే. చూడ్డానికి బలంగా ఉన్న కివీస్‌ ఫేవరెట్‌గా కనిపిస్తున్నా.. అంచనాలకందని పాక్‌నూ తక్కువ అంచనా వేయలేమని చరిత్ర చెబుతోంది. ఆసక్తికర సమరమైతే ఖాయం.

icc t20 world cup 2022 semi final
icc t20 world cup 2022 semi final
author img

By

Published : Nov 9, 2022, 7:07 AM IST

Pak vs Nz Semi Final 2022 : టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ జట్టు పాకిస్థాన్‌ను ఢీకొంటుంది. కివీస్‌దే పైచేయిగా అనిపిస్తే తప్పు లేదు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్‌లపై గెలిచి కఠినమైన గ్రూప్‌-1 టాపర్‌గా ఆ జట్టు సెమీస్‌లో అడుగుపెట్టింది. కానీ పాకిస్థాన్‌ పరిస్థితి భిన్నం. సూపర్‌-12లో తన తొలి రెండు మ్యాచ్‌లో భారత్‌, జింబాబ్వే చేతిలో ఓడిపోయి టోర్నీ నిష్క్రమణ అంచున నిలిచిన ఆ జట్టు.. స్వదేశం బయల్దేరడానికి ప్రణాళికల గురించి ఆలోచించి ఉంటుంది కూడా. కానీ దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్‌ షాకివ్వడంతో నాటకీయంగా పాక్‌కు సెమీస్‌ మార్గం సుగమమైంది. మరి న్యూజిలాండ్‌ ఫామ్‌ను కొనసాగిస్తుందా.. కలిసొచ్చి సెమీస్‌ చేరిన పాక్‌ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందా..?. తేలేది సిడ్నీలోనే.

ఎవరిదో పైచేయి..
ప్రపంచకప్పుల్లో పెద్ద మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ తడబాటు తెలియనిది కాదు. గత నాలుగు ప్రపంచకప్పుల్లోనూ (వన్డే, టీ20) సెమీఫైనల్‌ చేరిన ఆ జట్టు ఒక్కసారీ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. కివీస్‌ ఏడేళ్లలో మూడు ప్రపంచకప్‌ ఫైనల్స్‌ (2015, 2019లో వన్డేల్లో, 2021లో టీ20ల్లో) ఓడిపోయింది. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలన్న పట్టుదలతో ఉన్న న్యూజిలాండ్‌.. తమకు అనుకూలించే పరిస్థితుల్లో సత్తా చాటాలనుకుంటోంది. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టడం ద్వారా.. అంత బలంగా లేని పాక్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను అస్థిరపరచాలన్నది కివీస్‌ ఆలోచన. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ ఇప్పటికీ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. వరుస వైఫల్యాలతో ఒత్తిడిలో ఉన్నాడు. మరో ఓపెనర్‌ రిజ్వాన్‌ పరిస్థితి కూడా గొప్పగా ఏమీ లేదు. బ్యాటింగ్‌లో మూల స్తంభాలైన ఈ ఇద్దరి ఫామ్‌ పాక్‌కు ఆందోళన కలిగిస్తోంది. బంగ్లాదేశ్‌పై 128 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి కూడా పాక్‌ తడబడింది. ఈ నేపథ్యంలో ఒత్తిడిలో ఉన్న ఓపెనర్లను త్వరగా ఔట్‌ చేస్తే పని తేలికవుతుందని కివీస్‌ భావించడంలో ఆశ్చర్యం లేదు. ఆ జట్టు పాక్‌ బ్యాటర్లను షార్ట్‌ బంతులతో పరీక్షించే అవకాశముంది. పేసర్లు ట్రెంట్‌ బౌల్ట్‌, సౌథీలు బౌలింగ్‌లో కివీస్‌కు ప్రధాన ఆయుధాలు. ఇదే సిడ్నీలో వాళ్లు ఆస్ట్రేలియా, శ్రీలంక టాప్‌ ఆర్డర్లను బెంబేలెత్తించారు. ఫలితంగా న్యూజిలాండ్‌ సునాయాసంగా విజయాలు సాధించింది. అదే సమయంలో పాకిస్థాన్‌ బలం కూడా బౌలింగే. బ్యాటుతో ఆ జట్టు ఎంతగా రాణిస్తుందన్నదే మ్యాచ్‌లో కీలకం కానుంది. ఇక వేలి గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన కివీస్‌ బ్యాటర్‌ మిచెల్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడు.. కెప్టెన్‌ విలియమ్సన్‌, జోరుమీదున్న కుర్రాడు గ్లెన్‌ ఫిలిప్స్‌తో కలిసి మిడిల్‌లో కివీస్‌ భారాన్ని మోయనున్నాడు. ముఖ్యంగా ఫిలిప్స్‌ ఫామ్‌ న్యూజిలాండ్‌కు గొప్ప సానుకూలాంశం. గత మూడు మ్యాచ్‌ల్లో అతడు ఒక సెంచరీ, ఒక అర్ధసెంచరీ సాధించాడు. గత రెండు మ్యాచ్‌లతో పరుగుల బాట పట్టిన విలియమ్సన్‌ తన జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. పాకిస్థాన్‌ కూడా సెమీఫైనల్‌కు తమ ప్రయాణం గాలివాటం కాదని నిరూపించాలనుకుంటోంది. అదృష్టాన్ని పక్కన పెడితే.. షహీన్‌ అఫ్రిది, రవూఫ్‌లతో కూడిన ఆ జట్టు బౌలింగ్‌ బలంగా ఉంది. పాక్‌ ఇక్కడిదాకా రావడంలో వాళ్లది కీలక పాత్ర. గత మ్యాచ్‌లో అఫ్రిది.. బంగ్లాదేశ్‌పై కెరీర్‌ అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. పరిస్థితులపై అవగాహన ఉన్న రవూఫ్‌ను ఎదుర్కోవడం కూడా కివీస్‌ బ్యాటర్లకు తేలిక కాదు.

చరిత్ర పాక్‌ వైపు
పాకిస్థాన్‌ సెమీఫైనల్‌కు వచ్చిన తీరు చూస్తే 1992 ప్రపంచకప్‌ గుర్తుకు రావడం ఖాయం. ఆ జట్టు అప్పుడు కూడా ఇలాగే ఏమాత్రం ఆశలు లేని స్థితి నుంచి అనూహ్యంగా సెమీస్‌ చేరి.. ఆపై విజేతగా నిలిచింది. అప్పుడు సెమీస్‌లో గెలిచింది న్యూజిలాండ్‌పైనే. ఈ నేపథ్యంలో పాక్‌ ఈసారి ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరం. చరిత్ర పాకిస్థాన్‌కే అనుకూలంగా ఉంది. గతంలో మూడు సార్లు ప్రపంచకప్‌ (1992, 1999లో వన్డేల్లో, 2007లో టీ20లో) సెమీస్‌లో కివీస్‌తో తలపడ్డ పాక్‌.. అన్ని సార్లూ పైచేయి సాధించింది.

వాన వస్తే..
వర్షం కారణంగా ఈ ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచ్‌లు రద్దవడం సెమీఫైనల్‌ రేసును ప్రభావితం చేసిన సంగతి తెలిసిదే. మరి సెమీఫైనల్స్‌, ఫైనల్‌ రోజు వర్షం పడితే పరిస్థితేంటి అన్నది ప్రశ్న. బుధవారం వర్షం వస్తే పాక్‌-కివీస్‌ సెమీఫైనల్‌ను డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. సాధారణంగా కనీసం 5 ఓవర్ల ఆట జరిగేలా చూస్తారు. ఈసారి సెమీస్‌, ఫైనల్లో కనీసం 10 ఓవర్లు ఆట ఆడిస్తారు. అలా కూడా మ్యాచ్‌ నిర్వహించే అవకాశం లేకపోతే గురువారం (రిజర్వ్‌ డే) నిర్వహిస్తారు. బుధవారం మధ్యలో ఆట ఆగిపోతే.. ఆగిన చోటు నుంచి తర్వాతి రోజు మ్యాచ్‌ను కొనసాగిస్తారు. రిజర్వ్‌ డే రోజు కూడా ఆట సాధ్యం కాకపోతే గ్రూపులో మెరుగైన స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్‌కు వెళ్తుంది. అంటే గ్రూప్‌-1లో అగ్రస్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధిస్తుంది. భారత్‌-ఇంగ్లాండ్‌ సెమీఫైనల్‌ సాధ్యం కాకపోతే.. గ్రూప్‌-2లో అగ్రస్థానం సాధించిన భారత్‌ ఫైనల్లో ప్రవేశిస్తుంది. గ్రూప్‌-1లో ఇంగ్లాండ్‌ రెండో స్థానంలో నిలిచింది.

పిచ్‌
ఈ ప్రపంచకప్‌లో సిడ్నీలో జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో అయిదుసార్లు మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలిచాయి. అయితే ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మధ్య సూపర్‌-12 మ్యాచ్‌ జరిగిన పిచ్‌పైనే ఈ మ్యాచ్‌ ఆడనున్నారు. సిడ్నీలో ఈ టోర్నీ కోసం ఉపయోగించిన పిచ్‌లలో బ్యాటింగ్‌కు ఎక్కువ అనుకూలంగా ఉన్న పిచ్‌ ఇదే. ఉదయం వర్షం కురిసే అవకాశాలు స్వల్పంగా ఉన్నాయి. కానీ మ్యాచ్‌ వేళకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశాలే మెండు.

  • 17 న్యూజిలాండ్‌తో ఆడిన 28 టీ20ల్లో పాక్‌ సాధించిన విజయాలు
  • 5.93 ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు పవర్‌ప్లేల్లో పాకిస్థాన్‌ రన్‌రేట్‌. సూపర్‌-12లో జింబాబ్వే, నెదర్లాండ్స్‌ మాత్రమే ఇంతకన్నా తక్కువ రన్‌రేట్‌ను కలిగి ఉన్నాయి.
  • 3-8 ప్రపంచకప్పుల్లో నిలకడైన ప్రదర్శనే చేసినా.. పెద్ద మ్యాచ్‌ల్లో మాత్రం కివీస్‌ రికార్డు పేలవం. వన్డే, టీ20 ప్రపంచకప్పుల్లో కలిపి పదకొండు సార్లు సెమీఫైనల్‌ చేరిన ఆ జట్టు.. మూడుసార్లు మాత్రమే గెలిచింది. ఎనిమిది సార్లు ఓడిపోయింది.

తుది జట్లు (అంచనా)..

న్యూజిలాండ్‌: అలెన్‌, కాన్వే, విలియమ్సన్‌, ఫిలిప్స్‌, మిచెల్‌, నీషమ్‌, శాంట్నర్‌, సౌథీ, బౌల్ట్‌, సోధి, ఫెర్గూసన్‌

పాకిస్థాన్‌: రిజ్వాన్‌, బాబర్‌, హారిస్‌, షాన్‌ మసూద్‌, ఇఫ్తికార్‌, నవాజ్‌, షాదాబ్‌ ఖాన్‌, వసీమ్‌, నసీమ్‌ షా, షహీన్‌ షా అఫ్రిది, రవూఫ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.