ETV Bharat / sukhibhava

అంగస్తంభన సమస్య వేధిస్తోందా? ఈ ఆహార పదార్థాలతో చెక్​! - అంగం స్థంభన సమస్య పరిష్కార మార్గాలు

What To Eat For Making Penis Strong In Telugu : చాలా మంది పురుషులు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య - అంగస్తంభన. ఒక వేళ అంగం స్తంభించినా శృంగారం సమయంలో అది ఎక్కువ సేపు నిలవకపోవడం. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను చాలా సులువుగా అధిగమించవచ్చు. మరి ఆ ఆహార పదార్థాలేమిటో తెలుసుకుందామా?

What To Eat For Making Penis Strong
What To Eat For Making Penis Strong
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 7:57 AM IST

What To Eat For Making Penis Strong In Telugu : తమకు ఇష్టమైన భాగస్వామితో శృంగారంలో తనివితీరా పాల్గొనాలని పురుషుల్లో కోరిక ఉంటుంది. అది చాలా సహజం. అయితే తాము ఎంత కోరుకున్నా.. వారి అంగం మాత్రం గట్టిపడదు. ఒక వేళ గట్టిపడినా అది ఎక్కువ సేపు నిలవదు. ఇలాంటి సమస్యతో చాలా మంది పురుషులు మనోవేదనకు గురవుతూ ఉంటారు. అయితే ఈ సమస్యను కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుని సులభంగానే పరిష్కరించుకోవచ్చు. ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు సమస్యకు మూలాలు తెలుసుకోవాలి
అంగస్తంభన సమస్యకు అనేక కారణాలు ఉంటాయి. కనుక ముందుగా.. సమస్యకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
సాధారణంగా చాలా మందిలో హార్మోన్ల సమస్య ఉంటుంది. ఇలాంటి వారికి అంగస్తంభన సమస్య ఏర్పడవచ్చు. టెస్టోస్టీరాన్ తక్కువగా ఉన్నా.. ప్రోల్యాక్టిన్ ఎక్కువగా ఉన్నా ఈ సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది.

వ్యాధుల బారిన పడినవారిలో..
'థైరాయిడ్ సమస్య ఉన్నవారికి కూడా అంగం గట్టిపడకపోవడం అనే సమస్య తలెత్తవచ్చు. చక్కెర వ్యాధితో బాధపడే వారిలో కూడా ఈ సమస్య తలెత్తడానికి అవకాశాలున్నాయి. రక్తపోటు (బీపీ) నియంత్రణ కోసం వాడే మందుల వల్ల, మరికొన్ని రకాల ఔషధాల వల్ల కూడా ఈ అంగస్తంభన సమస్య ఏర్పడే అవకాశం ఉంది' అని వైద్యులు చెబుతున్నారు.

కొంత మంది పురుషుల్లో రక్తనాళాలు సన్నబడడం, రళ్తనాళాల్లో పూడికలు ఏర్పడడం, నరాల బలహీనత లాంటి సమస్యలు రావడం వల్ల కూడా అంగం గట్టిపడకపోవడం అనే సమస్య తలెత్తుతుందని వైద్యులు వివరిస్తున్నారు. అలాగే తగినంత నిద్రలేకపోవడం, ఆందోళనగా ఉండటం, సరైన పోషకాహారం అందకపోవడం లాంటి సమస్యల వల్ల కూడా ఈ అంగ స్తంభన సమస్య ఏర్పడుతుందని అంటున్నారు. అందుకే అసలు కారణం ఏంటనే దానిని ముందుగా తెలుసుకోవాలని, దానికి తగ్గట్టుగా నివారణ చర్యలు చేపట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.

కొన్నిరకాల ఆహారాలు:
అంగం గట్టిపడకపోవడం అనేది ప్రధానంగా హార్మోన్ల సమస్యే అయినా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అంగం గట్టిపడే అవకాశాలను రెట్టింపు చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పుచ్చకాయ. సీజనల్ ఫ్రూట్ అయిన పుచ్చకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల అంగస్తంభన సమస్య నుంచి బయటపడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రోజు వారి ఆహారంలో పాలకూరను జోడించుకోవడం, అప్పుడప్పుడు డార్క్ చాక్లెట్ తినడం, తరుచూ కాఫీ తాగడం వల్ల మేలు కలుగుతుంది. అలాగే ఆరెంజ్, బ్లూబెర్రీ పండ్లను వీలు కుదిరినప్పుడల్లా తినడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

అంగస్తంభన సమస్య వేధిస్తోందా? ఈ ఆహార పదార్థాలతో చెక్​!

వయసు 40 దాటిందా? - ఈ 7 టిప్స్​తో యంగ్​గా కనిపించండి!

షుగర్ ఉన్నవారు చికెన్, మటన్ తినకూడదా? ఏం తింటే బెటర్​?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.