ETV Bharat / sukhibhava

జీర్ణక్రియకు మేలు చేసే ప్రోబయోటిక్స్.. వీటి గురించి మీకు తెలుసా? - మేలు చేసే ప్రోబయోటిక్స్​

ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చని అంటారు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరైన ఆహారం కావాలి. అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారం శరీరానికి తగిన మోతాదులో అందడం వల్ల ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. అలాగే శరీరానికి ప్రోబయోటిక్స్ అందడం వల్ల మేలు కలుగుతుంది. అసలు ప్రోబయోటిక్స్ అంటే ఏమిటి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా మరి..!

top foods high in probiotics
top foods high in probiotics
author img

By

Published : Feb 26, 2023, 10:22 AM IST

మన శరీరంలో జరిగే అనేక రకాల ప్రక్రియలు మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకమైనది.. శరీరానికి తగిన సమతుల ఆహారం సమపాళ్లలో అందడం. ఇలా శరీరానికి తగిన పోషకాలు అందించడం వల్ల ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది. అయితే మన శరీరంలో కొన్ని కోట్ల సూక్ష్మజీవులు నివాసం ఉంటాయి. ఆ సూక్ష్మజీవుల్లో కొన్నింటినే ప్రోబయోటిక్స్​ అంటారు. అయితే వాటివలన మన శరీరానికి కలిగే లాభాలేంటో తెలుసుకోండి మరి..!

శరీరంలోని కోట్ల సూక్ష్మజీవుల్లో బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి. మళ్లీ వాటిలో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియాలతో పాటు కీడు చేసేవి కూడా ఉంటాయి. ఇలా మన శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియాలను వైద్యపరంగా 'ప్రోబయోటిక్స్' అని అంటారు. ఇవి మన శరీరంలో సజీవంగా ఉండే బ్యాక్టీరియాలు కాగా.. వీటి వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా జీర్ణాశయం, పేగుల్లో ఈ ప్రోబయోటిక్స్ నివసిస్తాయి. ఇవి జీర్ణక్రియను సక్రమంగా నిర్వహించేలా చూసుకుంటాయి. అయితే ఈ ప్రోబయోటిక్స్ మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి చేరుతాయి. పులియబెట్టిన ఆహారాల్లో ఎక్కువగా లభించే ప్రోబయోటిక్స్.. పేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

'ప్రోబయోటిక్స్ అంటే మన శరీరంలో ఉండే జీవం కలిగిన బ్యాక్టీరియా. సహజంగా ఆహారం ద్వారా ప్రోబయోటిక్స్ మన శరీరంలోకి చేరతాయి. కడుపునొప్పి, విరేచనాలు లాంటి సమస్యలతో బాధపడే వారికి వైద్యులు ప్రోబయోటిక్స్ కలిగిన మందులను ఇస్తుంటారు. పులియబెట్టిన ఆహారాల్లో సహజసిద్ధంగా లభించే ప్రోబయోటిక్స్​ని శరీరానికి అందించాలి. ముఖ్యంగా యోగట్​ని తీసుకోవాలి. పిల్లలకు ఐస్​ క్రీమ్​లు, చాక్లెట్ల కన్నా యోగట్ ఇవ్వడం ద్వారా అది వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే పులియబెట్టే ప్రక్రియ ద్వారా తయారు చేసే ఇడ్లీ, దోశ, ఉతప్పం, వీటితో పాటుగా ఈస్ట్ వేసి చేసే బ్రెడ్, బన్నులు తీసుకోవడం ఆరోగ్యానికి మంచి చేస్తుంది.'
-- డా. శ్రీలత, డైటీషియన్

పాల పదార్థాల్లో ఎక్కువ ప్రోబయోటిక్స్ లభిస్తాయి. వీటి వల్ల పేగుల ఆరోగ్యం కాపాడుకోవడానికి అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా పేగులలో వాపు.. కారణంగా జీర్ణక్రియలో తలెత్తే రకరకాల సమస్యలను ప్రోబయోటిక్స్ నివారిస్తాయి. అలాగే తామర, నోటి అనారోగ్యం, అలర్జీ, సాధారణ జలుబు నుంచి ప్రోబయోటిక్స్ కాపాడతాయి. సోయా పాలు, పెరుగు, మజ్జిగల ద్వారా ఎక్కువగా ప్రోబయోటిక్స్ శరీరానికి అందించడానికి వీలవుతుంది.

మెరుగైన జీర్ణక్రియకు మేలు చేసే.. ప్రోబయోటిక్స్ గురించి మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.