చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరిని వేధిస్తున్న సమస్యల్లో కంటి సమస్య ఒక్కటి. ఆహారపు అలావాట్లలో మార్పుల వల్ల కొంత మంది ఈ సమస్యతో బాధపడుతుండగా.. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మరికొంతమంది కంటి సమస్యలను తెచ్చుకుంటున్నారు. ప్రపంచంలో సుమారు 550 మిలియన్ల మంది ఏదో ఒక కంటి సమస్య వల్ల బాధపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. సరైన పరిష్కారానికి వెతుక్కోకపోతే వయసు మళ్లేలోపే చూపు మందగించే ప్రమాదాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కంటి సమస్యలు రావడానికి కారణాలు..
- రోజుకు 8 గంటలు పడుకోకపోతే వల్ల కంటి సమస్యలు వస్తాయి.
- ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌తో ఎక్కువ సమయం గడపటం వల్ల కూడా రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉంది.
- వివిధ రకాల మందుల వినియోగం వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుంటాయి. అవి కంటి చూపును దెబ్బతీస్తాయి.
- విటమిన్ డి, ఎ డెఫిషియన్సీ ఉన్నవారికి కంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.
కంటిని కాపాడుకోవచ్చు ఇలా..
మన ఒంటి ఆరోగ్యంతో పాటు కంటి ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మంచి నిద్రతో పాటు హెల్తీ డైట్‌ను అలవరుచుకుంటే చిన్న వయసులోనే కంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. అదెలా అంటే..
- సాధారణంగా తీసుకునే ఆహారంలో విటమిన్ సి, ఈ లతో పాటు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలా చూసుకోవాలి.
- చిన్నతనం నుంచే ఆకుకూరలు తినడం అలవాటు చేసుకోవడం వల్ల కంటి చూపును కాపాడుకోవచ్చు.
- పచ్చి ఆకు కూరలను డైట్లో భాగం చేసుకోవాలి. విటమిన్ ఎ పుష్కలంగా లభించే ఈ కూరల వల్ల వయసు మీదపడినా కంటి చూపు మందగించే అవకాశాలు తక్కువ.
- విటమిన్ ఎ అధికంగా లభ్యమయ్యే క్యారెట్స్ కూడా కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
- డార్క్ చాక్లెట్స్‌లో ఉండే కోకా కళ్ల చుట్టూ ఉండే కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతాయి.
- నిమ్మ, ఆరెంజ్, ద్రాక్ష, బెర్రీ లాంటి విటమిన్ సీ ఫుడ్స్‌ను డైట్లో తప్పనిసరిగా తీసుకోవడం వల్ల కంటి శుక్లాలు, మాక్యులా క్షీణత లాంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. బొప్పాయి తినడం వల్ల చాలా లాభాలున్నాయి.
- ఇదీ చదవండి:
- టైమ్ లేదని వ్యాయామం వాయిదా వేస్తున్నారా? అయితే ఇది మీకోసమే!
- ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నారా?.. ఈ సూపర్ ఫుడ్స్‌తో చెక్ పెట్టేయండి!