ETV Bharat / sukhibhava

మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారా? - కాఫీని మాత్రం అస్సలు తాగొద్దు!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2023, 10:34 AM IST

These Type of People Dont Drink Coffee : మీకు డైలీ కాఫీ తాగే అలవాటు ఉందా? అయితే ఇది మీకోసమే. ఎందుకంటే కాఫీని అందరూ తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ సమస్యలతో బాధపడుతున్న వారు అస్సలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. మరి, వారెవరు? ఎందుకు కాఫీ తాగకూడదు? అనేది ఇప్పుడు చూద్దాం..

Coffee
Coffee

These Type of People Who Dont Drink Coffee It will Cause Problems : మనలో చాలా మందికి కాఫీతోనే డే స్టార్ట్​ అవుతుంది. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి, తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి, బద్ధకాన్ని వదిలించుకోవడానికి, రియాక్టివేట్ అవ్వడానికి.. కాఫీ ఓ​ మెడిసిన్​ అని ఫీల్​ అయ్యి తాగుతుంటారు. అయితే ప్రతిరోజు కాఫీని(Coffee) మితంగా తీసుకుంటే.. టైప్‌-2 డయాబెటిస్‌ ముప్పు తగ్గుతుందని, డిప్రెషన్‌, ఒత్తిడి కంట్రోల్‌ చేస్తుందని, అల్జీమర్స్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు బరువు తగ్గడానికి కాఫీ తోడ్పడుతుందంటున్నారు. అయితే కాఫీని కొందరు మాత్రం అస్సలు తాగకూడదని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ, ఎలాంటి వ్యక్తులు కాఫీ తాగకూడదు? వారు ఎందుకు దీనికి దూరంగా ఉండాలి? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

జీవక్రియ తక్కువగా ఉన్నవారు : జీవక్రియ తక్కువగా ఉండే వ్యక్తులు కాఫీకి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మరీ తప్పదనుకుంటే.. ఉదయం పూట ఒక కప్పు మాత్రమే తాగాలని సూచిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కెఫిన్ డ్రింక్స్ అనేవి కొన్ని విటమిన్లు, ఖనిజాల శోషణను నిరోధిస్తాయి. దీర్ఘకాలంలో ఇది ఉబ్బరం, వాపునకు దారితీస్తుంది. జీవక్రియ తక్కువగా ఉండే వారు కెఫిన్​ను సరిగ్గా ప్రాసెస్ చేయలేరని నిపుణులు అంటున్నారు. ఫలితంగా ఆందోళన, చికాకు లాంటి సమస్యలు ఎదురవుతాయని పేర్కొంటున్నారు.

మహిళలు ఈ 5 ఆహార పదార్థాలు తిన్నారంటే - ఆరోగ్య సమస్యలన్నీ పారిపోతాయి!

గర్భిణీలు, పాలిచ్చే తల్లులు : వీరు కూడా కాఫీ తాగకపోవడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు. గర్భస్రావం, అకాల ప్రసవం, తక్కువ బరువుతో పిల్లల పుట్టడం వంటి ముప్పులను నివారించడానికి గర్భిణీలు కాఫీ తాగకపోవడమే ఉత్తమం అంటున్నారు. ఒకవేళ తాగాలనుకుంటే మాత్రం డాక్టర్ సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే పాలిచ్చే తల్లులు కాఫీ తాగకపోవడం మంచిది. ఎందుకంటే వీరు కాఫీ తాగితే డీహైడ్రేషన్‌కు గురి అయ్యే అవకాశం ఉంది.

అలెర్జీ ఉన్నవారు: అలెర్జీ ఉన్నవారు కాఫీని దూరం పెట్టడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాఫీలో కెఫిన్, థైరాసిన్, ఫైబరోగ్లాక్టన్ వంటి అలెర్జీని కలిగించే పదార్థాలు ఉంటాయని.. దీనివల్ల దద్దుర్లు, దురద, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తవచ్చని సూచిస్తున్నారు. అలెర్జీలు ఉన్నవారు కాఫీని తీసుకోవడానికి ముందు వారి వైద్యుడితో మాట్లాడటం మంచిదని సూచిస్తున్నారు.

వీళ్లు కూడా కాఫీ తాగకపోవడం బెటర్ : అంతేకాకుండా ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, నిద్రలేమి సమస్యతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండటమే బెటర్​ అని అంటున్నారు. కాఫీ తాగడం వల్ల ఈ సమస్యలు మరింత అధికం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుపుతున్నారు. ఒకవేళ అంతగా తాగాలనుకున్నవారు.. వారి వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నరు.

Avoid These Habits After Meal : తిన్న వెంటనే ఇలా చేస్తున్నారా.. అయితే జాగ్రత్త పడాల్సిందే..!

Health Benefits of Coconut Water : సీజన్ ఏదైనా.. కొబ్బరి నీళ్లు తాగండి.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.