ETV Bharat / sukhibhava

సడన్​గా బరువు పెరిగారా? - మీకు ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లే! చెక్​ చేసుకోండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2024, 9:42 AM IST

Weight Gain Health Issues : మీరు ఉన్నట్లుండి బరువు పెరుగుతున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. రోజూ మాదిరిగానే ఫుడ్ తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తున్నా.. మీ శరీరాకృతిలో తేడా వచ్చి ఆకస్మాత్తుగా లావు అయినట్లనిపిస్తే మీరు అలర్ట్​గా ఉండాల్సిందే అంటున్నారు నిపుణులు. అలా జరగడానికి ఈ ఆరోగ్య సమస్యలే కారణం కావొచ్చంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Weight_Gain_Health_Issues
Weight_Gain_Health_Issues

Sudden Weight Gain Health Problems: ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య వేధిస్తోంది. అయితే.. నార్మల్​గా వెయిట్ పెరగడానికి కొన్ని రోజులు, నెలలు పడుతోంది. కానీ.. కొంతమంది మాత్రం ఉన్నట్లుండి ఒక్కసారిగా విపరీతమైన బరువు(Weight) పెరిగిపోతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతారు. కారణాలు తెలుసుకోకుండానే వెయిట్ లాస్ అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు మొదలుపెడతారు.

Weight Gain Health Problems : అయితే మీరు కూడా సడన్​​గా.. ప్రత్యేకించి ఎలాంటి ప్రయత్నం లేకుండా ఉన్నట్లుండి ఇలా బరువు పెరిగితే వెంటనే అలర్ట్ కావాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఊహించని విధంగా బరువు పెరిగితే.. అందుకు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలే కారణం కావచ్చని వారు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అశ్రద్ధ వహించినా మీ ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ సడన్​గా బరువు పెరగడానికి నిపుణులు చెబుతున్న కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కుషింగ్స్ సిండ్రోమ్ : కొందరు సన్నగా ఉన్నవారు కండబలం కోసం వ్యాయామాలు చేస్తూ పోషకాహార నిపుణుల సూచనల మేరకు ఆహార నియమాలు పాటిస్తుంటారు. అలా కాకుండా మీరు అమాంతం బరువు పెరిగితే.. అనుమానించాల్సిందే. ఈ విధంగా బరువు పెరగడానికి కుషింగ్స్ సిండ్రోమ్ కూడా ఒక కారణం. అసలు కుషింగ్ సిండ్రోమ్ అంటే ఏమిటంటే.. ఇది ఒక రకమైన హార్మోన్. మన బాడీ ఎక్కువ మొత్తంలో కార్టిసాల్​ను రిలీజ్ చేసినప్పుడు ఈ సిండ్రోమ్ ఏర్పడుతుంది. ఈ హార్మోన్ జీవక్రియను నియంత్రిస్తుంది. కాబట్టి ఇది ఏర్పడినప్పుడు ఆకస్మాత్తుగా బరువు పెరుగుతారు. ముఖ్యంగా ముఖం, పొత్తికడుపు వంటి భాగాలలో ఈ సిండ్రోమ్ కారణంగా ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది.

హైపో థైరాయిడిజం : మీరు తీసుకునే ఆహారంలో ఎలాంటి మార్పులు లేకుండా, సాధారణ వ్యాయామాలు చేస్తున్నా.. ఉన్నట్లుండి బరువు పెరిగితే.. దానికి హైపో థైరాయిడిజం కూడా ఓ కారణం అయి ఉండొచ్చు. హైపో థైరాయిడిజం అంటే ఏమిటంటే.. మన బాడీలో T3, T4, TSH అనే హార్మోన్ల ఉత్పత్తిలో ఏదైనా తేడాలు వచ్చి ఇవి తక్కువగా రిలీజైతే థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది. ఈ కారణంగా అవయవాలు పనితీరు స్లో అవుతుంది. ఫలితంగా క్యాలరీలు త్వరగా కరగక శరీరంలో కొవ్వు పేరుకుపోయి వేగంగా బరువు పెరుగుతారు. అలాగే హైపోథైరాయిడిజం వస్తే గుండె కొట్టుకునే వేగం కూడా తక్కువగా ఉంటుంది.

న్యూ ఇయర్ తీర్మానం: మీ డైరీలో అవి ఉంటే - మీ డైట్​లో ఇవి ఉండాలి!

గుండె, లివర్‌, కిడ్నీ సమస్యలు : సడన్​గా బరువు పెరగడానికి గుండె, లివర్, కిడ్నీ సమస్యలు కూడా ఓ కారణం కావచ్చు. గుండె పనితీరులో ఏదైనా ప్రాబ్లమ్స్, మూత్రపిండాలు, కాలేయ సమస్యలు ఉన్నా.. బాడీలో ద్రవం నిలిచిపోయి.. శరీర బరువు ఒక్కసారిగా పెరిగిపోవచ్చు. కాబట్టి మీరు ఆకస్మాత్తుగా ఇలా జరుగుతున్నట్లు అనిపిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించి సంబంధిత టెస్టులు చేయించుకోవడం బెటర్.

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(PCOS) : మీరు ఉన్నట్లుండి వెయిట్ పెరగడానికి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కూడా కారణంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఇన్సులిన్ నిరోధకత, హార్మోన్ల అసమతుల్యత కారణంగా వస్తుంది. అయితే మన బాడీలో ఇన్సులిన్ కొవ్వు నిల్వలు పేరుకుపోయి వెయిట్ పెరగడానికి తోడ్పడుతుంది. ఇక అదే పీసీఓఎస్ ఉన్న వారిలో ఇది కంట్రోల్​లో ఉండదు. దాంతో పెరిగే గ్లూకోజ్ స్థాయిలకు బాడీ సరిగ్గా రియాక్ట్ అవ్వకపోవడమే కాకుండా ఇతర జీవక్రియలపై పనితీరుపై ఎఫెక్ట్ చూపిస్తోంది. దాంతో మీరు సడన్​గా బరువు పెరుగుతారు. కాబట్టి ఇలా జరిగినప్పుడు తక్షణమే డాక్టర్​ దగ్గరకు వెళ్లడం ఉత్తమం..

యవ్వనంలో స్లిమ్​గా ఉండి - ఆ తర్వాత బరువు పెరిగారా? అసలైన కారణమిదే!

చలికాలంలో బద్ధకాన్ని వదిలి బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ టిప్స్​ ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.