ETV Bharat / sukhibhava

పడుకునే ముందు చేసే ఈ పొరపాట్లే - అధిక బరువు కారణం!

Before Sleeping Habits Main Reason For Obesity : ప్రస్తుతం ఎంతోమంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు మొదలుపెడతారు. కానీ.. ఫలితం కనిపించదు. అయితే.. పడుకునే ముందు మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్లే బరువు తగ్గకపోగా మరింత పెరుగుతారంటున్నారు నిపుణులు..!

Weight Gain
Before Sleeping Habits Main Reason For Obesity
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2024, 10:45 AM IST

Before Sleeping Habits Main Reason For Obesity : మనం మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రతిరోజూ తగినంత నిద్ర చాలా అవసరం. కానీ.. ప్రస్తుత బిజీ లైఫ్​లో అంతా గజిబిజీ. ఎప్పుడు తింటున్నారో, ఎప్పుడు నిద్రపోతున్నారో క్లారిటీ ఉండట్లేదు. దీనికితోడు.. నిద్రపోయే ముందు కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. వీటివల్ల బరువు మరింతగా పెరిగిపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ : చాలా మందికి నిద్రపోయే ముందు స్మార్ట్​ఫోన్ యూజ్ చేసే అలవాటు ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఒక్క ఫోన్ మాత్రమే కాదు ట్యాబ్​లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఏదైనా సరే నిద్రకు ముందు వాడడం మంచిది కాదు. ఎందుకంటే వీటి నుంచి విడుదలయ్యే బ్లూ లైట్ మీ నిద్రకు భంగం కలిగించడమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. దాంతో సరైన నిద్ర లేకపోతే బరువు అదుపులో ఉండదు.

అర్ధరాత్రి ఫుడ్స్ తీసుకోవడం : కొందరికి అర్ధరాత్రి స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. అది కూడా బరువు పెరగడానికి కారణమంటున్నారు నిపుణులు. ఎందుకంటే పడుకునే టైమ్​లో మీరు తీసుకునే ఫుడ్​ జీర్ణం కావడానికి ఎక్కువ టైమ్ పడుతుంది. అలాగే నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. ముఖ్యంగా మిడ్​నైట్ తీసుకునే స్నాక్స్​లో చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు ఉండేవి అసలు తీసుకోకూడదు.

అధిక కార్బ్ ఆహారాలు : చాలా మంది డిన్నర్​లో తీసుకునే ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తలు పాటించరు. ముఖ్యంగా అధిక కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్స్ తీసుకుంటారు. బరువు పెరగడానికి అది కూడా ఒక కారణమంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కార్బ్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ మన బ్లడ్​లో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. కాబట్టి.. వీలైనంతమేర వాటిని తీసుకోవడం తగ్గించండి. బదులుగా లీన్ ప్రొటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం బెటర్.

Weight Loss Tips in Telugu : బరువు తగ్గాలా..? కుస్తీలు అవసరం లేదు.. రోజూ ఇలా చేస్తే చాలు!

తగినంత వాటర్ తాగకపోవడం : ఎక్కువ మంది పగటిపూట పని ఒత్తిడిలో పడి తగినంత వాటర్ తీసుకోరు. ఇక ఇప్పుడు అసలే చలికాలం దాంతో వాటర్ ఇంకా తక్కువ తాగుతారు. అయితే మీరు డే టైమ్ బాడీకి సరిపడా నీరు తాగకపోతే డీహైడ్రేషన్​కు దారితీసి.. రాత్రిపూట ఆకలిని పెంచుతుంది. దాంతో ఏదైనా చిరుతిండి తినాలనిపిస్తుంది. కాబట్టి ఈ సమస్య రాకుండా ఉండాలంటే డే టైమ్ తగినంత వాటర్ తీసుకోవడం ఉత్తమం.

సమయం లేని నిద్ర : ప్రస్తుతం చాలా మంది పని ఒత్తిడి, మారిన జీవనశైలి కారణంగా నిద్ర విధానాల్లో చాలా తేడా వచ్చింది. ఇక కొందరైతే నైట్ డ్యూటీలతో తగిన నిద్ర పోవట్లేదు. ఎక్కువ మంది డైలీ టైమ్ టూ టైమ్ నిద్రపోవట్లేదని చెప్పుకోవచ్చు. ఇలా గాడి తప్పిన నిద్ర విధానాలు బాడీలో కొన్ని వ్యవస్థలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యంగా అది మీ జీవ్రక్రియ, హార్మోన్ నియంత్రణపై ప్రభావం చూపుతుంది. కాబట్టి బరువు పెరగకుండా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన నిద్ర దినచర్యను రూపొందించుకోండి. దాని ప్రకారం హాలీడేస్​ టైమ్​లో కూడా డైలీ ఒకే టైమ్​కి పడుకోవడం, నిద్ర లేవడం చేయాలి. ఇది బరువు తగ్గడానికే కాదు మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో తోడ్పడుతుంది.

ఇకపోతే చివరగా ఒత్తిడి కూడా బరువు పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి వీలైనంత మేరకు ఒత్తిడి మీ దరిచేరకుండా చూసుకోవాలి. అందుకోసం డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు, ధ్యానం లేదా యోగా వంటి వాటిని ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం ద్వారా మీ మనస్సు ప్రశాంతంగా ఉండడంతో పాటు ఒత్తిడిని తగ్గించడానికి అనారోగ్యకరమైన స్నాక్స్ తినే కోరికను చాలా వరకు తగ్గిస్తాయి. ఇలా మేము చెప్పిన అలవాట్లకు దూరంగా ఉండి చూడండి. బెటర్ రిజల్ట్ మీకే కనిపిస్తోంది.

Weight Loss Tips At Home : హెల్దీగా బరువు తగ్గాలా?.. ఈ వంటింటి చిట్కాలు పాటిస్తే చాలు!

Skipping Health Benefits : పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలా?.. రోజూ 'స్కిప్పింగ్'​ చేస్తే చాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.